'ఆర్.ఆర్.ఆర్'తో పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడుతుందని ట్రేడ్ భావిస్తున్నా కానీ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తదుపరి చిత్రాలకి కూడా తెలుగేతర మార్కెట్లకి టార్గెట్ చేయాలని చూడడం లేదు. వారు రెగ్యులర్గా చేసే చిత్రాలనే కంటిన్యూ చేయాలని మన దర్శకులతోనే చర్చలు సాగిస్తున్నారు. సాహోతో ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసి భంగపడ్డ సంగతి తెలిసిందే.
అందుకే అలాంటి కథలు సెట్ అయితే ఇతర మార్కెట్ల మీద ఫోకస్ పెట్టవచ్చునని, లేదంటే ఎప్పటిలా ఇక్కడి అగ్ర దర్శకులతోనే చేస్తే మంచిదని ఇద్దరూ డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ మలి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువ అని తెలిసింది. హారిక హాసినిలో మరో చిత్రం చేయడానికి ఎన్టీఆర్ మాటపూర్వక ఒప్పందం చేసుకున్నాడు. అది ఆర్.ఆర్.ఆర్. తర్వాత వుండవచ్చునని భావిస్తున్నారు.
అలాగే రామ్ చరణ్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సంగతి ఇంటర్వ్యూలలో కూడా చెప్పేసాడు. కనుక వీరిద్దరికీ ఆర్.ఆర్.ఆర్. తర్వాత కెరీర్ ఎలా మలచుకోవాలనే దానిపై స్పష్టమైన అవగాహన వున్నట్టే కనిపిస్తోంది.