దాదాపు మూడేళ్లయింది దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా అందించి. ఆఖరికి ఈ మధ్యనే హీరో నాగార్జునతో సినిమా ప్రకటన వచ్చింది. అంత వరకు ఎన్ని కాంబినేషన్ల గ్యాసిప్ లో. లెక్కలేదు. అయితే నాగ్ తో సినిమా వచ్చిన నేపథ్యంలో ఇంకొ కొత్త గ్యాసిప్ కూడా వినిపిస్తోంది.
ఈ మధ్య ఓటిటి లు, వెబ్ సిరీస్ లు కాస్త హడావుడి ఎక్కువయింది కదా? ప్రవీణ్ సత్తారు కూడా ఇటు వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తన కథతో కాకుండా వేరే కథతో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు బోగట్టా. వైవిధ్యమైన చిత్రాలు అందించే దర్శకుడు ప్రశాంత్ వర్మ అందిస్తున్న కథతో ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి 14 రీల్స్ ప్లస్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా నాగ్ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమాకు ఇంకా 40 వర్కింగ్ డేస్ వరకు పెండింగ్ వుందని బోగట్టా. బహుశా ఆ గ్యాప్ లో ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ లాగించేస్తారేమో?