ఈ రోజుల్లో డైరక్టర్లు ఖాళీగా కూర్చోవడం లేదు. హీరోలతో సినిమాలు ఫిక్స్ చేసుకుంటూ, ఆ స్క్రిప్ట వ్యవహారాలు చూసుకుంటూనే, మరోపక్క ఏదో ఒక చిన్న సినిమానో, వెబ్ సిరీస్ నో లాగించేస్తున్నారు. ఎందుకంటే కాలాన్ని డబ్బుగా మార్చే అవకాశం డైరక్టర్లకు వుంది కదా? అలా అని హీరోలు ఏడాదికి ఓ సినిమా చేస్తూ వుంటే ఎలా? అందుకే ఇలా పక్క దారి పట్టి, తమ సృజనను, టైమ్ ను వాడేస్తుంటారు.
ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత ఎఫ్ 3 సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. కానీ కరోనా కారణంగా లేట్ అయిపోయింది. నారప్ప సినిమా ఫినిష్ చేసుకుని కానీ, హీరో వెంకటేష్ ఎఫ్ 3 సినిమా మీదకు రారు. అలాగే మరో హీరో వరుణ్ తేజ్ కూడా చేస్తున్న సినిమా ఫినిష్ చేసాకే ఎఫ్ 3 మీదకు వస్తారు.
అందుకే ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి మరో సినిమా అందించబొతున్నారని కొన్నాళ్ల కిందటే వెల్లడించాం. అయితే ఆ సినిమాకు అనిల్ రావిపూడి కథ మాత్రమే అందిస్తారు. మరో దర్శకుడు నక్కిన త్రినాధరావు డైరక్షన్ చేస్తారు. దిల్ రాజు నిర్మిస్తారు. ఈ విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే అనిల్ రావిపూడి-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో తయారయ్యే ఈ సినిమా గతంలో ఎప్పుడో వచ్చిన జంధ్యాల నాలుగు స్తంభాలాట, రెండు రెళ్లు ఆరు, టైపు కథ అంట. అంటే అలా ఆ కథ అని కాదు. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్ల మధ్య జరిగే డ్రమెటిక్ వ్యవహారం అన్నమాట.
సో ఇప్పుడు ఈ సినిమాకు ఇధ్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు కావాలి. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కు అంతే, ఎఫ్ 3 కి అంతే. కానీ అసలే హీరోలు ఎక్కడా, ఎవ్వరూ అందుబాటులో లేని టైమ్ ఇది. ఇలాంటి టైమ్ లో అనిల్-నక్కిన ప్రాజెక్టుకు ఇద్దరు హీరోలు ఎవరు సెట్ అవుతారో మరి చూడాలి.