ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఇరుకున పడ్డ బాబు

కొన్ని ఆరోపణలు.. ఆరోపణలుగానే ఉండాలి. వాటిపై విచారణ జరిగితే అసలు విషయం బైటపడుతుంది, ఆరోపణల్లో పసలేదని తేలిపోతుంది, ఎవరిపైనైతే బురద జల్లాలనుకుంటామో.. వారే కడిగిన ముత్యంలా బైటకొస్తారు. సరిగ్గా చంద్రబాబు అలాంటి వ్యూహంలోనే ఇరుక్కుపోయారు. …

కొన్ని ఆరోపణలు.. ఆరోపణలుగానే ఉండాలి. వాటిపై విచారణ జరిగితే అసలు విషయం బైటపడుతుంది, ఆరోపణల్లో పసలేదని తేలిపోతుంది, ఎవరిపైనైతే బురద జల్లాలనుకుంటామో.. వారే కడిగిన ముత్యంలా బైటకొస్తారు. సరిగ్గా చంద్రబాబు అలాంటి వ్యూహంలోనే ఇరుక్కుపోయారు. 

ఏపీలో ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయంటూ నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టులో పిల్ వేయించి బుక్కైపోయారు చంద్రబాబు. కోర్టు ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని అడగడం చంద్రబాబు విజయంగా కొంతమంది ఊహిస్తున్నారు కానీ, అదే ఆయన పరాజయానికి తొలిమెట్టు.

వాస్తవంగా ఈ కేసులో విచారణ జరక్కపోయి ఉంటే.. ఇంకో మూడున్నరేళ్లపాటు ఇవే ఆరోపణలు చేస్తూ చంద్రబాబు కాలం గడిపేవారు. ఇప్పుడు కోర్టు విచారణ అంటోంది కాబట్టి.. దానిపై నిజా నిజాలు నిగ్గుతేలతాయి. పసలేని ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో తేలిపోతుంది. ట్యాపింగ్ జరగలేదని, అదంతా ఊహాగానమేనని పోలీస్ విచారణలో తేలితే చంద్రబాబు అప్పుడేమంటారు. మహా అయితే మాకు సీబీఐ ఎంక్వయిరీ కావాలంటారు, అంతే కానీ కోర్టుల్లో మరోసారి పిల్లిమొగ్గలు వేసే ఛాన్స్ ఆయనకి ఉండదు.

చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఊహించి ఉండరు. ఆధారాలుంటే ఇవ్వండి విచారణ చేస్తామంటూ స్వయంగా రాష్ట్ర డీజీపీయే చెప్పిన వేళ, చంద్రబాబు షాకయ్యారు. అలా ఆధారాలడిగితే మేమెక్కడినుంచి తెస్తామని లోలోపల మథనపడ్డారు. అందుకే పోస్ట్ ఢిల్లీకి పంపితే మీరెందుకు స్పందిస్తారంటూ ట్రాక్ మార్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహా మరికొందరితో ఇదే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.

రాష్ట్రంలో తప్పు జరిగిందని ఆరోపణ చేసినప్పుడు దానిపై విచారణ చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ శాఖదే కదా. ఆ బాధ్యతతోనే డీజీపీ సాక్ష్యాలు అడిగారు. అవి లేవు కాబట్టే చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అసలు జడ్జిలు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చంద్రబాబుకి ఎలా తెలిసింది, ఎవరైనా ఆయనకి మొరపెట్టుకున్నారా? లేక ఏవైనా రహస్యాలు బైటపడ్డాయా?

ఈరోజు కాకపోయినా విచారణలో భాగంగా రేపు అయినా ఆ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరని కోర్టు కచ్చితంగా ప్రశ్నిస్తుంది. అప్పుడైనా పిల్ వేసినవారికి చీవాట్లు తప్పవు. చంద్రబాబు ఆత్మరక్షణలో పడక తప్పదు. ఆధారాలు లేకుండా మాట్లాడి.. తనకు తెలియకుండానే చంద్రబాబు కార్నర్ అయిపోయారు.

ఆదిపురుష్ కేవలం యుద్దకాండ ?

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి