కరోనాతో పెద్దవాళ్లే నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు కరోనా వైరస్ దాడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే మందు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇదిగో ఆక్స్‌పర్డ్ మందు, అదిగో రష్మా మందు అని అనడమే తప్ప…మార్కెట్‌లో వచ్చిందే లేదు.
పెద్దలే హాహాకారాలు పెడుతున్న కరోనా మహమ్మారి…పిల్లలకు అటాక్ అయితే ఏంటి పరిస్థితి? ఆ మహమ్మారికి పిల్లాపెద్దా , పేద ధనిక అనే తేడా ఎంత మాత్రం లేదు. ప్రముఖ సింగర్ మాళవిక కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడామె హోం ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుత బాధల్లా ఏంటంటే తన రెండేళ్ల కుమార్తె కూడా కరోనా బారిన పడినట్టు మాళవిక ప్రకటించారు.
ఏ పాపం తెలియని రెండేళ్ల చిన్నారి కరోనా బారిన పడిందనే సమాచారం ప్రతి ఒక్కరి మనసుల్ని చివుక్కుమనేలా చేసింది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా అని నిర్ధారణ అయినట్టు మాళవిక తెలిపారు. మాళవిక కుటుంబ సభ్యులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.