‘తెగింపు’..ఏముంది..ఇందులో

ఏనుగు సామెతలా వుంది ‘తెగింపు’ సినిమా ట్రయిలర్. తమిళ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పట్టుమని పది రోజులు లేదు. అయినా విడుదల డేట్ ఇంకా చెప్పలేకపోతున్నారు. సంక్రాంతి…

ఏనుగు సామెతలా వుంది ‘తెగింపు’ సినిమా ట్రయిలర్. తమిళ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పట్టుమని పది రోజులు లేదు. అయినా విడుదల డేట్ ఇంకా చెప్పలేకపోతున్నారు. సంక్రాంతి బరిలో అంటూ జస్ట్ ట్రయిలర్ విడుదల చేసారు. తమిళ ట్రయిలర్ డబ్బింగ్ వెర్షన్ నే ఈ తెలుగు ట్రయిలర్ కూడా.

అజిత్ స్టయిలిష్ మూవ్ మెంట్స్ తప్ప ట్రయిలర్ లో కొత్తదనం అన్నది కించిత్ కూడా లేదు. హీరో ఒక బ్యాంక్ ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దాంతో ఇటు పోలీసులు..అటు హీరో..బటానీల్లా తుపాకీ గుళ్లు విరజిమ్మడం..ఒకటి రెండు పంచ్ డైలాగులు ఇంతే. ట్రయిలర్. అజిత్ సినిమాకు అంతకన్నా ఏముంటుంది అనుకుంటే ఏమీ చెప్పేది లేదు.

అజిత్ సినిమాలు చాలా కాలంగా కేవలం హీరోయిజాన్ని, స్టంట్ లను నమ్ముకుని తీసేస్తున్నారు. సరైన కథ..కమామిషు వుండడం లేదన్న విమర్శలు వున్నాయి. ఇప్పుడు వచ్చిన తెగింపు ట్రయిలర్ చూస్తుంటే ఇది కూడా పూర్తిగా అజిత్ స్టయిలిష్ యాక్షన్ మీద ఆధారపడి తీసినట్లు కనిపిస్తోంది. లేదా కథ మొత్తం వెనకాల దాచేసారు అనుకోవాలేమో?