‘మెగా’ఆనందం మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి ఆనందం మామూలుగా లేదు. వాల్తేర్ వీరయ్య సినిమా ఫైనల్ కాపీని ఆయన చూసిన దగ్గర నుంచి ఆనందం ఆగడం లేదు. ఆరు రోజుల కిందట సినిమా చూసి వచ్చిన తరువాత మీడియాతో…

మెగాస్టార్ చిరంజీవి ఆనందం మామూలుగా లేదు. వాల్తేర్ వీరయ్య సినిమా ఫైనల్ కాపీని ఆయన చూసిన దగ్గర నుంచి ఆనందం ఆగడం లేదు. ఆరు రోజుల కిందట సినిమా చూసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడినపుడే ఆయన ఆ విషయం వెల్లడించి, ఆనందం వ్యక్తం చేసారు. లేటెస్ట్ గా యూనిట్ మొత్తానికి, తన సన్నిహితులకు ఓ గ్రాండ్ గలా పార్టీ ఇచ్చేసారు.

నిన్నటి నిన్న న్యూ ఇయర్ కమ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ అన్నట్లు ఆయన ఓ మాంచి పార్టీ ఇచ్చేస్తారు.ఈ పార్టీకి యూనిట్ అంతటినీ ఆహ్వానించారు. అలాగే తన్న సన్నిహితులను కూడా పిలిచారు. పనిలో పనిగా అందరికీ వాల్తేర్ వీరయ్య పాటలను ప్రదర్శించారు. వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని గెస్ట్ లు అంతా ముక్తకంఠంతో అన్నారట.

చూస్తుంటే వాల్తేర్ వీరయ్య సినిమా మీద మెగాస్టార్ కు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లు కనిపిస్తోంది. పండగ బరిలో పోటాపోటీగా దిగుతోంది ఈ సినిమా. అటు బాలయ్య స్ట్రయిట్ సినిమా, ఇటు విజయ్, అజిత్ ల డబ్బింగ్ సినిమాలు రెండూ బరిలోకి దిగుతున్నాయి. 

ఒక విధంగా చెప్పాలంటే అన్నింటికంటే చివర్న రంగంలోకి దిగుతున్నది మెగా సినిమానే. ఈ నెల 8న విశాఖలో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ మీట్ భారీగా జరగబోతోంది.