ఓ సినిమా సూపర్ హిట్టయిందంటే దాని రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోతాయి. ఇక హిట్టయిన సినిమాది యూనివర్సల్ సబ్జెక్ట్ అయితే రేటు ఆకాశాన్నంటుతుంది. తాజా సెన్సేషన్ లవ్ టుడే విషయంలో ఇదే జరుగుతోంది.
ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా బోనీ కపూర్ పేరు తెరపైకొచ్చింది. లవ్ టుడే రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి ఈ నిర్మాత దక్కిచుకున్నట్టు వార్తలొచ్చాయి
అయితే బోనీ కపూర్ ఈ వార్తల్ని ఖండించారు. లవ్ టుడే రీమేక్ రైట్స్ ను తను దక్కించుకోలేదని, ప్రస్తుతం మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ నిర్మాత స్పష్టం చేశారు.
బోనీ కపూర్ సంగతి పక్కనపెడితే.. హిందీలో రీమేక్ కు తగ్గ క్వాలిటీస్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సెల్ ఫోన్లు ఎక్స్ ఛేంజ్ జరిగితే.. పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ల మధ్య అభిప్రాయబేధాలు ఎలా వచ్చాయనే విషయాన్ని ఫన్నీగా ఈ సినిమాలో చర్చించారు. ఎవరైనా కుర్ర హిందీ హీరో ఈ ప్రాజెక్టును సెలక్ట్ చేసుకుంటే బాగుంటుంది.