అరకు జిల్లాకే అల్లూరి పేరు పెట్టాలి…!

అల్లూరి సీతారామరాజు. యుక్త వయసులోనే బ్రిటిష్ వారితో పోరాడి తన ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు. పుట్టింది రాజకుమారుడిగా అయినా పెరిగింది, సేవ చేసింది మాత్రం గిరిపుత్రులకు. మన్నెంలోని అమాయకులైన వారికి అండగా…

అల్లూరి సీతారామరాజు. యుక్త వయసులోనే బ్రిటిష్ వారితో పోరాడి తన ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు. పుట్టింది రాజకుమారుడిగా అయినా పెరిగింది, సేవ చేసింది మాత్రం గిరిపుత్రులకు. మన్నెంలోని అమాయకులైన వారికి అండగా దండగా అల్లూరి ఉంటూ మన్నెం  వీరుడు అనిపించుకున్నాడు. వారి హక్కుల కోసం తుదివరకూ  పోరాడిన యోధుడిగా చరిత్రలో నిలిచారు.

అటువంటి అల్లూరి పేరును అరకు కొత్త జిల్లాగా ఏర్పడితే పెట్టాలని ఎప్పటినుంచో అంతా కోరుతున్న మాట. నిజానికి అల్లూరి తండ్రిది పశ్చిమ గోదావరి జిల్లా అంటారు. ఆయన అమ్మ పుట్టినిల్లు మాత్రం విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామం. ఇది భీమిలీ నియోజకవర్గంలో ఉంది.

అల్లూరి పాండ్రంగిలో తాతగారింట పుట్టాడని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లితో కలసి మేనమామల ఇంటికి అదే పాండ్రంగి వచ్చారని కూడా చెబుతారు.

ఇక అల్లూరి  ఏజెన్సీ ముఖ్యద్వారం నుంచి నర్శీపట్నం పాడేరు, అరకు ప్రాంతాల్లో తిరిగి గిరిజనులకు తోడుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ రోజుల్లో ఆయన బ్రిటిష్ వారి విధానాలను ఎలుగెత్తి చాటాడు. మరి అల్లూరి జీవితం అంతా  విశాఖ ఏజెన్సీతో ముడిపడిఉంది కాబట్టి అరకు జిల్లాకు ఆయన పేరు పెడితే సబబు అన్నది చరిత్రకారుల వాదనగా ఉంది.

అయితే అల్లూరి తండ్రి తాతలది పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి నర్సాపురం పార్లమెంట్ జిల్లాకు అల్లూరి పేరు పెడతారని ప్రచారం మరో వైపు సాగుతోంది. అక్కడ క్షత్రియ ఆధిపత్యం రాజకీయంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముందే చెప్పుకున్నట్లుగా అల్లూరి పుట్టింది రాజుగా అయినా ఆయన జీవితం  ధారపోసింది మాత్రం గిరిజనుల కోసం కాబట్టి ఆయన పేరిట అరకు కొత్త జిల్లా కావాలనే మేధావులు సహా అంతా కోరుతున్నారు.

ఆదిపురుష్ కేవలం యుద్దకాండ ?

కోపం వస్తే వీళ్ళిద్దరూ ఏం చేస్తారో తెలుసా ?