టాలీవుడ్ సర్కిళ్లలో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఇదే. రెండు భారీ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తోంది మైత్రీ మీడియా సంస్థ. వీటిలో బాలయ్య వీర సింహారెడ్డి కి వంద కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది అని తెలుస్తోంది. బడ్జెట్ ముందు అనుకున్న దాని కన్నా పెరిగిపోయిందని టాక్ వుంది.
బాలయ్య మార్కెట్ మించి ఖర్చు చేసేసారు. ముఖ్యంగా వర్కింగ్ డేస్ లెక్కకు మించి పెరిగాయి. వడ్డీల సంగతి చెప్పనక్కరలేదు. ఈ మేరకు మార్కెట్ అవుతుందా? అన్నది ప్రశ్న.
ఇక చిరు వాల్తేర్ వీరయ్య కు కూడా ఖర్చు బాగానే అయ్యింది. వర్కింగ్ డేస్, ప్రొడక్షన్ ఖర్చు తో పాటు ఈ సినిమాకు రెమ్యూనిరేషన్లు కూడా భారీనే. చిరు..రవితేజ దగ్గర నుంచి టెక్నికల్ టీమ్ వరకు అంతా భారీనే. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వచ్చే మొత్తాలు తక్కువ వుంటాయి. సినిమాల కలెక్షన్ల మీద కూడా ప్రభావం వుంటుంది.
అదీ కాక ఈ రెండు సినిమాల నాన్ థియేటర్ హక్కులు చాలా కాలం ముందే క్లోజ్ అయ్యాయి. పైగా మొదట అనుకన్న దాని కన్నా రెమ్యూనిరేషన్లు కూడా కొంత పెరిగాయి. అందువల్ల ఈ రెండు సినిమాలు విడుదల నాటికి బ్రేక్ ఈవెన్ కావడం అన్నది కాస్త కష్టమే అన్నది ఇండస్ట్రీ టాక్. థియేటర్ మార్కేట్ మీదే అంతా డిపెండ్ అయి వుంటుందని మార్కెటింగ్ జనాలు చెబుతున్నారు. నైజాంలో రెండు సినిమాలు కలిసి 40 కోట్ల వరకు వసూలు చేయాల్సి వుంటుంది. అలాగే ఏపీ లో కూడా నలభై కోట్ల మేరకు వసూళ్లు సాగించాలి.
అప్పుడే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ అవుతారు. సినిమాలకు వస్తున్న బజ్, సంక్రాంతి సీజన్ అన్నీ కలిపి టార్గెట్ ను రీచ్ అవుతాయని నిర్మాతలు నమ్మకంగా వున్నారు. ఇటీవల కాలంలో చిరంజీ సినిమాలకు బజ్, హడావుడి వస్తోంది కానీ, థియేటర్ కు జనాలు రావడం మాత్రం కాస్త తక్కువగానే వుంది. ఈ సినిమాతో దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అలాగే బాలయ్య సినిమాల మీద ఇంట్రస్ట్ పెరిగిందన్న టాక్ వుంది. దాని మీదా క్లారిటీ వస్తుంది ఇప్పుడు.