క్లారిటీ ఇచ్చేసిన ‘గంటా’

దాదాపు మూడేళ్ల నుంచి ఒకటే దాగుడు మూతలు ఆడుతున్నారు విశాఖ రాజ‌కీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీలో వున్నా అంటారు. కానీ చంద్రబాబును కలవరు. నియోజ‌కవర్గంలో పార్టీ సమావేశాలు నిర్వహించ‌రు.  Advertisement తన…

దాదాపు మూడేళ్ల నుంచి ఒకటే దాగుడు మూతలు ఆడుతున్నారు విశాఖ రాజ‌కీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీలో వున్నా అంటారు. కానీ చంద్రబాబును కలవరు. నియోజ‌కవర్గంలో పార్టీ సమావేశాలు నిర్వహించ‌రు. 

తన పని తనది అన్నట్లు రకరకాలుగా వ్యవహరిస్తూ వుంటారు. వైకాపాలో చేరతారని ఒకటే ఊహాగానాలు. పోనీ క్లారిటీగా ఖండిస్తారా అంటే అదీ లేదు. నర్మగర్భంగా మాట్లాడతారు. జ‌నసేన వైపు చూస్తారేమో అని మరో అనుమానం. ఇంకో పక్క కాపులను సమైక్యం చేసే పని కొత్తగా మొదలు పెట్టారు.

ఇలాంటి నేపథ్యంలో గంటా తెలుగుదేశంలోనే కొనసాగుతారన్న క్లారిటీ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా గంటా వదిలిన గ్రీటింగ్ కార్డ్ మీద చంద్రబాబు ఫొటో ప్రామినెంట్ గా దర్శనమిచ్చింది. అంటే ఇప్పటికి గంటాకు ఓ క్లారిటీ వచ్చిందన్న మాట. తెలుగుదేశంలో కొనసాగాలని, గంటా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

కాపు నాయకుడిగా అవతారం ఎత్తి, తన బలం, బలగం చూపించి, తనకు కావాల్సిన నియోజ‌కవర్గంలో టికెట్ సంపాదించుకోవడమే గంటా లక్ష్యం అన్నది రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. చోడవరం, అనకాపల్లి, భీమిలి నియోజ‌కవర్గాల మీద గంటా కన్ను వుందని టాక్. ఈమేరకు తెలుగుదేశం పార్టీ కనుక అస్యూరెన్స్ ఇచ్చేస్తే చాలు. 

జ‌నసేన లోకి గంటాను ఎలాగూ రానివ్వరు అని రాజ‌కీయ వర్గాల టాక్. వైకాపాలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ ఎందుకో వెనుకా ముందు అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో గ్రీటింగ్ కార్డ్ మీద ప్రామినెంట్ గా చంద్రబాబు ఫొటో వుండడంతో ఓ క్లారిటీ వచ్చింది ప్రస్తుతానికి.