ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేని మనిషి అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
‘ప్రతిపక్ష నేత చంద్రబాబు లాంటివారు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అన్యాయం జరిగిపోయిందని.. నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని’ ఆయన పేర్కొన్నారు.
అందుకే గ్రామ సచివాలయాల పక్కనే ఏర్పాటు చేసే దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు.
ఎవ్వరూ కూడా నాణ్యత విషయంలో వేలెత్తి చూపించకూడదన్నారు. నాణ్యతకు ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు.