ఈ మధ్య సినిమాల ఖర్చులు భయంకరంగా పెరిగిపోయాయి. ఆర్టిస్ట్ లు రెమ్యూనిరేషన్లు, టెక్నీకల్ టీమ్ ఫీజులు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీ ఇలా ఒకటేమిటి అన్నీ పెరిగాయి. దానికి తోడు కరోనా కాలంలో వృధా వడ్డీలు. ఇవన్నీ కలిసి హీరో నాని చేస్తున్న టక్ జగదీష్ సినిమా బడ్జెట్ ను 40 కోట్లకు చేర్చేసినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు నిర్మాణంలో చేసి 'వి' లాంటి టెక్నికల్ సినిమాకు 40 కోట్లు ఖర్చు. సాహు గారపాటి నిర్మాణంలో చేసే టక్ జగదీష్ లాంటి ఫ్యామిలీ మూవీకి నలభై కోట్లు ఖర్చే. దీనికి కారణం ఈ సినిమాలో స్టార్ కాస్ట్ బాగా ఎక్కువగా వుండడం కూడా అని తెలుస్తోంది.
ఇప్పటికే నాన్ థియేటర్ ద్వారా 18 కోట్ల వరకు రికవరీ వచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. థియేటర్ రైట్స్ ద్వారా మరో 27 వరకు రావచ్చు అని అంచనా. సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ (ఒకప్పుడు దిల్ రాజు భాగస్వామి) కి ఎన్ఆర్ఎ పద్దతిలో ఇచ్చేసారు. అయితే ఎంత ఎన్ఆర్ఎ అన్నది ఫైనల్ కాలేదు. ఎందుకంటే 2021 సమ్మర్ కు కానీ ఈ సినిమా రావడం కష్టం. అప్పటి పరిస్థితులను బట్టి కాస్త ముందుగా రేటు ఫైనల్ చేసుకుంటారు. అప్పటి వరకు ముందు వాళ్లకే సినిమా అన్నది మాత్రం ఫైనల్ చేసుకున్నారు.