కందుకూరు విషాదం మరిచిపోక ముందే గుంటూరులో జరిగిన చంద్రబాబు బహిరంగ సభలో మరో విషాదం చోటుచేసుకుంది. గుంటూరులోని వికాస్ నగర్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన జనాత వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణిలో తొక్కిసలాట జరిగి ప్రమాదం జరిగినట్లు సమచారం.
గత వారంలో నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఇదేం ఖర్మ.. కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే.