హీరో నాని తన సినిమాల లైనప్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో సినిమాకు సంబంధం లేకుండా, కంటిన్యూగా ఒకటే జానర్ లో సినిమాలు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అంటే సుందరానికి ఫన్..తరువాత దసరా సినిమా మాస్..ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమా క్లాస్… అన్నట్లు కనిపిస్తోంది. మైత్రీ సంస్థలో ఒకప్పుడు భాగస్వామిగా వున్న సివిఎమ్ నిర్మాతగా నాని 30 వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఎంత జాగ్రత్త లు తీసుకున్నా జెర్సీ తరువాత మూడు ఫ్లాపులు తప్పలేదు నానికి. గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్ ఆశించిన మేరకు జనాలకు రీచ్ కాలేదు. ఆ తరువాత శ్యామ్ సింగ్ రాయ్ మంచి పేరు తెచ్చినా, ఆ వెంటనే అంటే సుందరానికి మళ్లీ నిరాశ పర్చింది. దసరా సినిమా విడుదలకు రెడీ అవుతోంది. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా ఇది. దీని మీద నాని కి ఆశలు చాలా వున్నాయి
ఇలాంటి నేపథ్యంలో కొత్త దర్శకుడి తో నాని 30 వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. చూస్తుంటే జెర్సీ తరువాత మళ్లీ క్లాస్, పీల్ గుడ్ ఎమోషన్ ను నాని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సీతారామం హీరోయిన మృణాళ్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంచుకున్నాడు.
ఖుషి సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహిబ్ ను ఈ సినిమాకు తీసుకుంటున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ కోసం వదిలిన వీడియో చూస్తుంటే మళ్లీ క్లాస్ జానర్ ను నాని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.