పూనమ్ గోడ మీద పిల్లి.. ఫైర్ బ్రాండ్ ఫైర్

పవన్ కల్యాణ్ అంటే ఇద్దరికీ కోపమే. కాకపోతే శ్రీరెడ్డి బయటపడుతుంది, పూనమ్ కౌర్ బయటపడదు అంతే తేడా. పూనమ్ ఈ వ్యవహారశైలే శ్రీరెడ్డికి నచ్చదు. అందుకే పదేపదే పూనమ్ పై సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా…

పవన్ కల్యాణ్ అంటే ఇద్దరికీ కోపమే. కాకపోతే శ్రీరెడ్డి బయటపడుతుంది, పూనమ్ కౌర్ బయటపడదు అంతే తేడా. పూనమ్ ఈ వ్యవహారశైలే శ్రీరెడ్డికి నచ్చదు. అందుకే పదేపదే పూనమ్ పై సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా మరోసారి పూనమ్ పై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. “ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు” అంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఈ ట్వీట్ ఆమె ఏ ఉద్దేశంతో పెట్టిందో, ఎవర్నీ ఉద్దేశించి పెట్టిందో అందరికీ తెలిసిందే. అది బహిరంగ రహస్యమే. అలాంటప్పుడు పవన్ పేరును ఓపెన్ గా చెప్పడానికి ప్రాబ్లమ్ ఏంటని ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి.

“ఇలా గోడ మీద పిల్లి ట్వీట్లు పెట్టకు పూనమ్. ధైర్యముంటే డైరక్ట్ గా మాట్లాడు. నీ వల్లే అవుతుంది వాడి పెళ్లి. ఒక్క చిన్న కంప్లయింట్ ఇవ్వు. మిగతాది మా వాళ్లు చూసుకుంటారు.” ఇలా పూనమ్ పై నేరుగా విమర్శలు చేసింది శ్రీరెడ్డి.

పవన్ కల్యాణ్ ను డైరక్ట్ గా విమర్శించడానికి ఎప్పుడూ మొహమాటపడలేదు శ్రీరెడ్డి. అతడి పేరును ప్రస్తావిస్తూ నేరుగా ఎన్నో విమర్శలు చేసింది. అవసరమైతే సాక్ష్యాలు కూడా చూపిస్తానంటూ ఒక దశలో స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. పవన్ వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ జీవితంపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.

ఈమధ్య పవన్ కల్యాణ్ పై కామెంట్స్ కాస్త తగ్గించింది శ్రీరెడ్డి. ఇలా తను ఓవైపు డైరక్ట్ ఎటాక్ ఇస్తుంటే.. మరోవైపు పూనమ్ కౌర్ పరోక్షంగా కామెంట్స్ పెట్టడం శ్రీరెడ్డికి నచ్చలేదు. అందుకే పూనమ్ ను గోడమీద పిల్లితో పోల్చింది.

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే