ఉత్తమ్ రెడ్డి ఔట్, ఏ రెడ్డి ఇన్?

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రుణం తీరిపోయినట్టుగా ఉంది. ఉత్తమ్ ను తప్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచినే…

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రుణం తీరిపోయినట్టుగా ఉంది. ఉత్తమ్ ను తప్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచినే ఆ డిమాండ్ ఉంది. అయితే అధిష్టానం ఆ డిమాండ్ ను సీరియస్ గా తీసుకోలేదు.

అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనతో ఉత్తమ్ కు తీవ్రమైన ఇబ్బంది  తప్పలేదు. తను మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించిని నియోజకవర్గంతో తన భార్యను పోటీచేయించి ఆయన గెలిపించుకోలేకపోయారు. ఈ పరిణామాల్లో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఉత్తమ్ కూడా మొహమాట పడుతున్నట్టుగా ఉన్నారు.

ఇప్పటికే రాజీనామా విషయాన్ని అధిష్టానానికి ఆయన తెలియజేసినట్టుగా సమాచారం. అది ఆమోదం కూడా పొందినట్టే అని, తదుపరి ఆ పదవికి ఎవరో ఒకరిని ఎంపిక చేశాకా అధికారిక ప్రకటనలు రాబోతున్నాయని సమాచారం.

ఇక జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ ముగ్గురూ జాబితాలో వినిపిస్తున్న పేర్లు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంకావడం వెంకట్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అన్నదమ్ములిద్దరూ ఒకే పార్టీ వైపే ఉండి ఉంటే.. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కేదేమో! ఇక రేవంత్ రెడ్డి దూకుడైన నేతే కానీ, అందరికీ ఆమోదయోగ్యుడేనా? అనేది సందేహమే.

ఇక జానారెడ్డికి ఆ పదవి దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే జానాకు ఆ పదవి దక్కినా ఒకటే, దక్కకపోయినా ఒకటే. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.. అనే భావనలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యాల్లో టీపీసీసీకి కొత్త ప్రెసిడెంట్ ఎంపిక గురించి సోనియా, రాహుల్ లు కసరత్తు చేస్తున్నారట!

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే