సముద్రంలోని నీరు అంతా తాగు నీరు అయితే ఇక నీటి కష్టాలు ఉండవు, కన్నీటి వెతలు అంతకంటే ఉండవు. కానీ ప్రక్రుతిలో ఉప్పు కూడా అవసరమే కదా. అందుకే నదులూ నదీ నదాలే నీటి కోసం ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభాకు సరిపడా నీటి వనరులు పెరగడంలేదు. మరో వైపు ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి.
విశాఖ మెట్రో సిటీగా ఎదిగింది. ఇపుడు పరిపాలనా రాజధానిగా మారుతోంది. ఈ సమయంలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, ప్రజల తాగు నీటికి కూడా నీరు అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ ఓ కొత్త పధకానికి శ్రీకారం చుడుతోంది.
అదేంటి అంటే విశాఖ సాగర జలలను డీశాలినేషన్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీశాలినేషన్ ప్లాంట్ ని విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా సాగర జలాలను ఉపయోగించుకునేందుకు ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్నారుట.
ఈ మేరకు ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న ఇజ్రాయిల్ దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కలసి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనుందిట. అలా డీశాలినేషన్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రకంగా వచ్చే నీటిని పరిశ్రమల అవసరాలకు వాడుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి రాజధాని కాబోతున్న విశాఖ విషయంలో ప్రభుత్వం చిత్తశుధ్ధిలో చర్యలు చేపడుతోంది.