ఎందుకు లేట్ అయిందో చెప్పేశాడు

ఇస్మార్ట్ శంకర్ థియేటర్లలోకి వచ్చేసింది. తాజాగా వందరోజులు కూడా పూర్తిచేసుకుంది. అయినప్పటికీ రామ్ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు. పైగా చేసేది రీమేక్ ప్రాజెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా…

ఇస్మార్ట్ శంకర్ థియేటర్లలోకి వచ్చేసింది. తాజాగా వందరోజులు కూడా పూర్తిచేసుకుంది. అయినప్పటికీ రామ్ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు. పైగా చేసేది రీమేక్ ప్రాజెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా అఫీషియల్ గా సినిమాను ఎనౌన్స్ చేయకపోవడం అందర్లో గందరగోళం రేపింది. ఎట్టకేలకు దీనిపై స్పందించాడు రామ్.

ఈరోజు రామ్ కొత్త సినిమా రెడ్ లాంఛ్ అయింది. తమిళ్ లో ఆమధ్య వచ్చిన తడమ్ సినిమాకు రీమేక్. కాకపోతే నిర్మాత రవికిషోర్ దీన్ని రీమేక్ గా చెప్పడంలేదు. అందరూ చెప్పినట్టే కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం, చాలా మార్పులు చేసాం అంటున్నాడు. సరే, ఆ సంగతి పక్కనపెడితే.. ఈ ప్రాజెక్టు కోసం ఫుల్ గా ప్రిపేర్ అయి, ఫస్ట్ లుక్ రెడీ చేసి, టైటిల్ కూడా ఫిక్స్ చేసి, పక్కా ప్లానింగ్ తో రావాలనే ఉద్దేశంతోనే గ్యాప్ తీసుకున్నట్టు రామ్ ప్రకటించాడు.

నిజంగానే ఈ ప్రాజెక్టు విషయంలో రామ్ తో పాటు యూనిట్ అంతా పక్కా ప్లానింగ్ లో ఉంది. బాలీవుడ్ స్టయిల్ లో ప్రారంభోత్సవం రోజునే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 16 నుంచి మొదలవుతుంది.

థ్రిల్లర్ జానర్ లో రెడ్ సినిమా వస్తున్నప్పటికీ, ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటున్నాడు రామ్. కిషోర్ తిరుమల మార్క్ డైలాగ్స్ తో పాటు, తన ఎనర్జీ మొత్తం కనిపిస్తుందని చెబుతున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడని ప్రకటించిన రామ్, హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచాడు.

రామ్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి