అయ్యోపాపం.. చంద్రబాబు.. పాడు రోజులొచ్చెనే!

‘‘మా పార్టీ పని అయిపోలేదు…’’ అని ఒక పార్టీ అధినేత ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన దుర్గతి ప్రాప్తించిందంటే.. జాలి కలుగుతుంది. రాజకీయ ప్రత్యర్థులు వంద రకాల పుకార్లు, తీసికట్టు మాటలతో వారి ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం…

‘‘మా పార్టీ పని అయిపోలేదు…’’ అని ఒక పార్టీ అధినేత ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన దుర్గతి ప్రాప్తించిందంటే.. జాలి కలుగుతుంది. రాజకీయ ప్రత్యర్థులు వంద రకాల పుకార్లు, తీసికట్టు మాటలతో వారి ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజంగా బలంగా ఉన్నవారు.. అలాంటి పుకార్లను, ప్రచారాలను పట్టించుకోకుండా సాగిపోతుంటారు. విమర్శలను ఢీకొంటూ ముందుకెళ్తారు. కానీ.. చంద్రబాబునాయుడు పాపం… ‘‘మా పార్టీ పని అయిపోలేదు.. దమ్ము చూపే పార్టీ మాది..’’ అని చెప్పుకుంటున్నారంటే.. ఆయన ఈ తరహా ప్రచారాలు ప్రజల్లోకి చొచ్చుకువెళ్తున్నాయేమో అని భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇసుక విక్రయాల విషయంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నమాట నిజం. అయితే ఆ అంశాన్ని పట్టుకుని.. తక్షణం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దిగిపోయేలాగా.. ఏదో ఒకటి చేసేయాలని విపక్షాలు ఆత్రుత పడుతున్నాయి. పారదర్శకంగా ఉండడానికే ప్రభుత్వం ఆన్ లైన్ విధానం తెచ్చింది. కానీ.. ఓపెన్ కాగానే.. నో స్టాక్ బోర్డు కనిపించేలా.. ముందే కొనేస్తున్న దళారీలలో తెలుగుదేశం వారు కూడా పుష్కలంగా ఉన్నారు.

మరోవైపు రాజధాని మీద ప్రభుత్వం కొత్త కమిటీ వేయడం, అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనుల మీద తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ఇవన్నీ చంద్రబాబుకు సహజంగానే కంటగింపుగా ఉన్నాయి. జగన్ సర్కారు అడుగులు.. గత అయిదేళ్లలో తాను చేసిన తప్పులను ఎండగడతాయనే భయం ఆయనను వెన్నాడుతోంది. వల్లభనేని వంశీ వైకాపాలోకి మారిపోతే గనుక.. పార్టీకి వాటిల్లగల నష్టం గురించి ఆయన బాగా భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

వైకాపానుంచి గతిలేని సెకండ్ గ్రేడ్ నాయకులు ఒకరిద్దరు తెదేపాలో చేరగానే.. జగన్ మీద వారికి విశ్వాసం సడలిపోయిందని… ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చంద్రబాబు ప్రేలాపనలు చేసిన విషయం పాఠకులకు గుర్తుంటుంది. అయితే ఇప్పుడు తమ పార్టీనుంచి సిటింగ్ ఎమ్మెల్యే.. తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుని.. పార్టీకి రాజీనామా చేసి.. వైకాపాలో చేరడానికి సిద్ధపడడం ఇంకెలాంటి సంకేతాలు ఇస్తుందో ఆయనకు బాగా తెలుసు.

తెదేపా పనైపోయినట్టుగా వైకాపా నుంచి ఈ సందర్భంగా, ఎవ్వరూ అనలేదు గానీ.. సోషల్ మీడియా ప్రచారాలకే చంద్రబాబు బెదిరిపోతున్నారు. విజయవాడలో కార్యకర్తల సమావేశం పెట్టి.. మా పార్టీ పని అయిపోలేదు.. అని చెప్పుకుంటున్నారంటేనే ఆయన పరిస్థితి ఎంత దీనంగా మారిందో అర్థమౌతుంది.

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..