కరోనా కారణంగా వచ్చిన ఖాళీ టైమ్ ను ఒక్కొక్కరు ఒక్కో విదంగా వాడుకుంటుంటే దర్శకుడు సంపత్ నంది మరో విధంగా వాడుకుంటున్నారు. రెండు స్క్రిప్ట్ లు తయారుచేసి, తన అసిస్టెంట్ లకు అప్పచెప్పి, రెండు చిన్న ప్రాజెక్ట్ ల్లో ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారు. ఓ సబ్జెక్ట్ ను నిర్మాత రాధామోహన్ కు, మరో సబ్జెక్ట్ ను నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావుకు ఇచ్చేసారు.
రాధామోహన్ నిర్మించేది థ్రిల్లర్ సినిమా. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల నడుమ జరిగే థ్రిల్లర్. జస్ట్ కోటి, కోటిన్నరతో ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి తీసేసి, వీలైతే థియేటర్ లేకపోతే ఓటిటికి ఇచ్చి లాభం చేసుకోవాలన్నది ప్లాన్. ఇందులో మరీ సగానికి సగం కాదు కానీ, కొంత శాతం లాభం తన స్క్రిప్ట్ కింద సంపత్ నంది తీసుకుంటారు.
అలాగే చిట్టూరి శ్రీను నిర్మాతగా వెబ్ సిరీస్ కూడా ఇదే డీల్ తో రూపొందిస్తారు. సీటీమార్ సినిమా తన డైరక్షన్ జరుగుతున్నదున, తన పేరు వేయడం అంత బాగోదు కాబట్టి, సహాయాకులకు ప్రమోషన్ ఇస్తూ, తాను సూపర్ వైజ్ చేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు సంపత్ నంది.