ఈషా రెబ్బా ఫ్యాన్స్ కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. నిత్యం కొత్త కొత్త ఫొటోలతో అలరించే ఈ అమ్మడి సోషల్ మీడియా ఎకౌంట్ మూగబోయింది. ఈమె ఎకౌంట్ ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఆమె ఎకౌంట్ మొత్తం ఖాళీ అయింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని ఈషా రెబ్బా ఇనస్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఏవైనా అవాంఛనీయ పోస్టులు, ఫొటోలు తన ఎకౌంట్ లో ప్రత్యక్షమైతే వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.
ఈమధ్య తన గ్లామర్ డోస్ మరింత పెంచింది ఈషా రెబ్బ. మొన్నటివరకు సంప్రదాయబద్దంగా కనిపించిన ఈ తెలుగమ్మాయి, హాట్ హాట్ ఫొటోల్ని మినిమం గ్యాప్స్ లో అప్ లోడ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా బాగుందనుకున్న టైమ్ లో ఇలా ఈషా ఎకౌంట్ హ్యాక్ అయింది.
సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ అవ్వడం కొత్తేంకాదు. మొన్నటికిమొన్న సింగర్ స్మిత ఎకౌంట్ ను హ్యాక్ చేసి, అందులో ఏకంగా నీలిచిత్రాలు పెట్టారు. తిరిగి తన ఎకౌంట్ ను రాబట్టుకోవడానికి స్మితకు 24 గంటలు పట్టింది. ఇప్పుడు ఈషాకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఇషా రెబ్బా. ఇందులో ఆమె స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఇంకో వెబ్ సిరీస్ లో కాల్ గర్ల్ పాత్రలో కనిపించబోతోంది ఈషా రెబ్బా.