పెద్ద డైరక్టర్లతో సినిమాలు అన్నీ లైన్ లో పెట్టుకున్నాడు హీరో బన్నీ. అలవైకుంఠపురములో సక్సెస్ తరువాత సుకుకమార్ తో పుష్ప సినిమా స్టార్ట్ అనౌన్స్ చేసారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమా అంతా పూర్తి చేసుకుని, రెడీ అయ్యేసరికి కనీసం 2021 దసరానో? 2022 సంక్రాంతినో కావచ్చు.
ఆ తరువాత కొరటాల శివ సినిమా వుంది. మధ్యలో ఏదో విధంగా మేనేజ్ చేసినా 2022 సమ్మర్ లోపు ఆ సినిమా వచ్చే అవకాశాలు తక్కువ. అప్పుడు ప్రారంభం కావాలి మళ్లీ మరోసారి త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్. అంటే ఆ సినిమా విడుదల అన్నది 2023 సంక్రాంతినే.
త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి వుంది. దాని తరువాత రామ్ చరణ్ సినిమా. ఆపైన బన్నీ సినిమా. 2021, 2022, 2023 ఇలా ఏడాదికి ఒకటి అన్నమాట. కరోనా వ్యవహారం సద్దు మణిగిపోయి, అంతా సజావుగా మారిపోతే ఇదీ టైమ్ టేబుల్. లేకపోతే, ఇక అంతే సంగతులు..ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.