కొత్త దర్శకుడు మల్లిడి వేణు తీసుకువచ్చిన మాంచి సబ్జెక్ట్ నచ్చేసి తనే నిర్మించాలని డిసైడ్ అయ్యారు హీరో కళ్యాణ్ రామ్. ఇదంతా ఆరునెలల కిందట సంగతి. ఈలోగా శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో సినిమా ఆఫర్ వచ్చింది. గుజరాతీ మూవీ రీమేక్. దాంతో అటు వెళ్లారు. అది పూర్తిచేసారు. సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
అది అయిన తరువాత మళ్లీ స్వంత సినిమా మీదకు వస్తారేమో అనుకుంటే, ఇప్పుడు మరో సినిమా ప్రకటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో 118 లాంటి సక్సెస్ ఫుల్ సినిమా నిర్మించిన ఈస్ట్ కోస్ట్ సంస్థతో మరో సినిమాను త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోయే సినిమా ఎలాగూ వుంది.
మరి ఈ 'తుగ్లక్' సినిమా ఏమవుతుందో? కొత్త దర్శకుడు మల్లిడి వేణుకు తొలి ఫ్రాజెక్టు జీవితకాలం లేటు అన్నట్లుగా వుందిగా.