క్రిస్మస్ స్లాట్ లోకి శర్వానంద్-సమంత కాంబినేషన్ లో తను నిర్మించే 96 రీమేక్ ను వదుల్దామనుకున్నారు నిర్మాత దిల్ రాజు. కానీ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ వర్క్ పెండింగ్ లో వుండిపోవడంతో, కాపీ రెడీ కాలేదు. అయితే అంతకు ముందుగా నవంబర్ నెల ఫస్ట్ వీక్ లో తనే హీరో రాజ్ తరుణ్ తో నిర్మించిన మరో సినిమా ఇద్దరి లోకం ఒకటే ను విడుదల చేద్దామనుకున్నారు. కానీ మార్కెట్ అంత బాగానే లేదని ఆగిపోయారు.
ఇప్పుడు ఈ సినిమాను తీసుకెళ్లి క్రిస్మస్ బరిలో దింపుతున్నారు. డిసెంబర్ 25న (బుధవారం) ఇద్దరిలోకం ఒకటే సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు దిల్ రాజు. డిసెంబర్ 20న రూలర్, ప్రతిరోజూ పండగే సినిమాలు వున్నాయి. 25 హాలీవుడ్, అలాగే జనవరి 1 హాలీడే. ఆ విధంగా రెండు సెలవులు వచ్చేవారం అని ఆ రోజున ఇద్దరిలోకం ఒకటే సినిమాను వదుల్తున్నారు.