మెగా పూనకాలు లోడ్ అయ్యాయి

వాల్తేర్ వీరయ్య సినిమా రోజు రోజుకు పబ్లిసిటీ కంటెంట్ తో బజ్ పెంచుకుంటోంది. ఒక్కో పాట బయటకు వస్తుంటే హైప్ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఏ కంటెంట్ కూడా సినిమా బజ్ ను…

వాల్తేర్ వీరయ్య సినిమా రోజు రోజుకు పబ్లిసిటీ కంటెంట్ తో బజ్ పెంచుకుంటోంది. ఒక్కో పాట బయటకు వస్తుంటే హైప్ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఏ కంటెంట్ కూడా సినిమా బజ్ ను పెంచిందే తప్ప తగ్గించలేదు. మొదటి నుంచీ పూనకాలు లోడింగ్ అనే క్యాచీ వర్డ్ ను తెగ వాడుతూ వస్తోంది టీమ్. ఇప్పుడు అదే వర్డ్ తో రూపొందించిన పాటను వదిలారు. ఇద్దరు హీరోలు మెగాస్టార్..రవితేజ ఇద్దరూ కలిసి చేసిన పాట ఇది. ఈ పాటను ఈ రోజు విడుదల చేసారు.

పక్కాగా సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా వుందీ పాట. వందలాది మంది డ్యాన్సర్లతో చిత్రీకరించిన ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కచ్చితంగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తాయి. దేవీ అందించిన ట్యూన్ పెద్ద గొప్పగా లేదు. దానికి రోల్ రైడా అందించిన లిరిక్స్ కూడా పెద్ద గొప్పగా లేవు. కానీ పిక్చరైజేషన్, చిరు బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన చిన్న చిన్న స్టెప్స్ మాత్రం బానే వున్నాయి.

భారీ క్రౌడ్ తో పాటను చిత్రీకరించడం, మాస్ మ్యూజిక్, మాస్ లుక్స్ వల్ల థియేటర్ లో పాట జనాలకను అలరించే అవకాశం వుంది. ఇప్పటికే పార్టీ సాంగ్…సోలో సాంగ్ రెండూ జనాల్లోకి బాగానే వెళ్తాయి. ఇప్పుడు ఇది కూడా బాగానే రీచ్ తెచ్చుకుంటే వాల్తేర్ వీరయ్య ఆల్బమ్ కు క్రేజ్ వచ్చినట్లే లెక్క.