స్టయిలిష్ స్టార్ బన్నీ అమితంగా ఇష్టపడిపోయి, అర్జెంట్ గా అనౌన్స్ చేసి, అదే టైటిల్ లో వున్న క్యాప్ పెట్టుకుని తిరగడానికి కారణమైన ఐకాన్ సినిమా ప్రాజెక్టు ఆగిపోయినట్లే. వేణు శ్రీరామ్ చెప్పిన లైన్ విని ఎగ్జయిట్ అయిపోయిన బన్నీ టోటల్ స్క్రిప్ట్ విన్నాక, నో చెప్పేసినట్లు తెలుస్తోంది.
నిజానికి సుకుమార్ సినిమా, ఐకాన్ సినిమా రెండూ సమాంతరంగా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిర్ణయం మారింది. ఐకాన్ ను పక్కనపెట్టి మైత్రీమూవీస్-సుకుమార్ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాకు బుధవారం ఉదయం మైత్రీమూవీస్ కార్యాలయంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూజ నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం బన్నీ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. పాటలు మాత్రం వున్నాయి. అవి కూడా నవంబర్ రెండోవారం దాటేసరికి అయిపోతాయి. దాని తరువాత బన్నీ నేరుగా సుకుమార్ ప్రాజెక్టు మీదకు వస్తారు.
డిజె తరువాత నిర్మాత దిల్ రాజు చేస్తారనుకునే బన్నీ సినిమా కథ ఆ విధంగా ముగిసింది అనుకోవాలి.