టాలీవుడ్ కు మరో విలన్ దొరికినట్టేనా!

ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. వారసత్వంగా హీరోలు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ హీరోయిన్లు, విలన్లకు మాత్రం నిత్యం కొరతే. హీరోయిన్లు అడపాదడపా క్లిక్ అవుతున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ విలన్లు మాత్రం…

ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. వారసత్వంగా హీరోలు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ హీరోయిన్లు, విలన్లకు మాత్రం నిత్యం కొరతే. హీరోయిన్లు అడపాదడపా క్లిక్ అవుతున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ విలన్లు మాత్రం దొరకడం లేదు. ఈ సీజన్ కు మరో విలన్ దొరికినట్టే కనిపిస్తున్నాడు. అతడే విజయ్ సేతుపతి.

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్.. కథ నచ్చితే ఇలా ఎలాంటి పాత్ర పోషించడానికైనా సిద్ధం ఈ నటుడు. సైరా సినిమాలో రాజ పాండీగా పాజిటివ్ క్యారెక్టర్ తో మెప్పించిన విజయ్ సేతుపతి, ప్రస్తుతం ఉప్పెన అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ సినిమాలో కూడా విలన్ గా నటించే అవకాశం అందుకున్నాడు.

త్వరలోనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే విజయ్ కు నెరేషన్ ఇచ్చాడు సుకుమార్. అతడి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బన్నీ మూవీ కాబట్టి విజయ్ సేతుపతి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సుకుమార్ తో చేయబోయే ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వస్తుంది. ఈ సినిమా క్లిక్ అయితే టాలీవుడ్ కు మరో విలన్ దొరికినట్టే.

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?