మూడో పరిష్కారమే.. తేలే దారి లేదు!

ప్రభుత్వం దిగి రావాలి… యూనియన్లు దిగి రావాలి… సాధారణంగా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అంటే.. ఒక కొలిక్కి రావడానికి కనిపించే రెండుదార్లు ఇవి. అది కొంచెం, ఇది కొంచెం జరిగినా కూడా.. ఈ రెండుదారుల…

ప్రభుత్వం దిగి రావాలి… యూనియన్లు దిగి రావాలి… సాధారణంగా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అంటే.. ఒక కొలిక్కి రావడానికి కనిపించే రెండుదార్లు ఇవి. అది కొంచెం, ఇది కొంచెం జరిగినా కూడా.. ఈ రెండుదారుల కిందికే పరిగణించవచ్చు. కానీ.. సంస్థాగతమైన సమస్య వ్యక్తిగత రూపు దాల్చినట్లుగా.. ఇరువర్గాలూ పంతాలు పట్టుదలలకూ పోయి భీష్మించుకుంటున్నట్లుగా కూర్చున్నారు. ఏతావతా.. ఏమవుతున్నదంటే… ఇప్పుడున్న పరిమితమైన రవాణా సదుపాయాలకే ప్రజలు అలవాటు పడిపోతున్నారు.

మరి కొన్నాళ్లు గడిస్తే రవాణా సమ్మె పేరిట.. ఉద్యోగులు మరో ఏడాది పాటూ విధులకు హాజరుకాకుండా కూర్చున్నా కూడా పెద్దగా పట్టించుకునే దిక్కుండదు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె పరిస్థితి రోజురోజుకూ బిగిసిపోతోంది. ప్రభుత్వమూ యూనియన్లూ కూడా ఒక్క మెట్టు కూడా దిగి రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయగలదు? ప్రజలను ఎప్పటికీ.. ఇలాంటి ప్రత్యామ్నాయ రవాణా వసతుల మీదనే బతకమని వదిలేయాలా..? లేదా తమంతగా ఇతర ఏర్పాట్లకు పూనుకోవాలా? ఇతర ఏర్పాట్ల వైపే ప్రభుత్వం మొగ్గుతోంది.

హైకోర్టు హూంకరిస్తున్నది గనుక.. ప్రభుత్వం వైపు తప్పు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది గానీ.. నిజానికి యూనియన్లు కూడా హైకోర్టు తీర్పును ఖాతరు చేస్తున్న పరిస్థితి లేదు. యూనియన్లే కోర్టును ఆశ్రయించాయి. కోర్టు 21 అంశాల మీద చర్చలు జరపాలని సూచించింది. కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకుంది. చర్చలకని వచ్చి.. అధికారుల ఎదుట కూర్చుని.. ఆర్టీసీ విలీనం సహా మొత్తం అన్ని అంశాలను చర్చిస్తే తప్ప.. తాము ఒపుకొనేది లేదని.. యూనియన్లు అక్కడికక్కడ మడతపేచీ పెట్టడం ఏమిటో అర్థంకాని సంగతి.

సాధారణంగా కార్మిక వర్గంవైపు సానుభూతి ఉంటుంది. కానీ.. వారు ఇలా కోర్టు తీర్పు మేరకు జరుగుతున్న చర్చల్లో ఇలాంటి మొండి పట్టుదల ప్రదర్శిస్తే ప్రజలు వారిని పట్టించుకోవడం మానేస్తారు. కేసీఆర్ కూడా ప్రెవేటు ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనలు చేస్తున్నారు. కేబినెట్ భేటీ జరిగిందంటే ఇందుకు సంబంధించిన నిర్ణయం రావొచ్చు. యూనియన్ల ఒత్తిడిని ఏమాత్రం ఖాతరు చేయని కేసీఆర్.. అప్పగించే ఆలోచనలు చేస్తున్నారు. కేబినెట్ భేటీ జరిగిందంటే ఇందుకు సంబంధించిన నిర్ణయం రావొచ్చు.

యూనియన్ల ఒత్తిడిని ఏమాత్రం ఖాతరు చేయని కేసీఆర్.. లీజు బస్సులతో ప్రెవేటు ఆపరేటర్లకు రూట్ పర్మిట్లు ఇస్తే గనుక.. ఆర్టీసీ ఉద్యోగులు కూచున్న కొమ్మను నరుక్కున్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ప్రజలకు కొద్దిగా కొత్త ఇబ్బుందులు రావొచ్చు. కానీవారు వాటికి త్వరగా అలవాటు పడిపోతారు. కానీ.. ఉద్యోగుల్లో చాలా మందికి తీర్చలేని నష్టం జరుగుతుంది.

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?