మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేసే ఈ నటి, ఈసారి కూడా అదే పంథాను ఎంచుకుంది. ఆమె పెట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్వీట్ చూసిన వాళ్లంతా పరోక్షంగా దాన్ని పవన్ కల్యాణ్ కు అన్వయిస్తున్నారు.
ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు. ఇది పూనమ్ పెట్టిన ట్వీట్. ఇక్కడ ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు. జస్ట్ ఏ థాట్ (ఓ చిన్న ఆలోచన) అని మాత్రమే పేర్కొంది. కానీ ఆమె ఎవర్ని ఉద్దేశించి ఈ స్టేట్ మెంట్ పెట్టిందో నెటిజన్లకు మాత్రం అర్థమైపోయింది. ఈ ట్వీట్ కింద పెట్టిన కామెంట్స్ అన్నీ పవన్ కు అన్వయిస్తూ ఉన్నాయి.
గతంలో కూడా పవన్ పై పలు ట్వీట్స్ చేసింది పూనమ్. మరీ ముఖ్యంగా పవన్-పూనమ్ ను లింక్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెను దుమారం రేపాయి. అదే టైమ్ లో పూనమ్ పెట్టిన కొన్ని ట్వీట్లు కూడా సంచలనం అయ్యాయి. పవన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. ఓ బడా దర్శకుడిపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది పూనమ్.
నిజానికి గత ఎన్నికల టైమ్ లో పవన్ కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ పూనమ్ కౌర్ మాత్రం తెరవెనక ఉండడానికే నిర్ణయించింది. సినిమాలు లేకపోయినా చిన్నచిన్న అవకాశాలతో నెట్టుకొస్తున్న ఈమె, ఇప్పుడు మరోసారి పరోక్షంగా పవన్ పై ట్వీట్ చేయడం వైరల్ అయింది.