నాగబాబుకు ఉన్న విలువ కూడా లోకేష్ కు లేదా..!

టీడీపీలో లోకేష్, జనసేనలో నాగబాబు ఒక్కటే. వీళ్లు నోరు విప్పారంటే పార్టీకి అనర్థమే. కొన్నిసార్లు నోరు జారతారు, మరికొన్నిసార్లు అసలు ఏం మాట్లాడతారనే విషయంలో వారికే క్లారిటీ ఉండదు. కులగజ్జి పార్టీ ఏదైనా ఉందంటే…

టీడీపీలో లోకేష్, జనసేనలో నాగబాబు ఒక్కటే. వీళ్లు నోరు విప్పారంటే పార్టీకి అనర్థమే. కొన్నిసార్లు నోరు జారతారు, మరికొన్నిసార్లు అసలు ఏం మాట్లాడతారనే విషయంలో వారికే క్లారిటీ ఉండదు. కులగజ్జి పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేనని లోకేష్ గతంలో అన్నారు. నాగబాబు మరో అడుగు ముందుకేసి ఏకంగా 'గాడ్సే' వ్యాఖ్యలు చేశారు. 

అలా ఇద్దరూ పార్టీకి చేటు చేశారు. లోకేష్ మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారు. నాగబాబు కూడా అంతే. లోకేష్ ను పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఎవ్వరూ చూడరు. ఇక నాగబాబునైతే అసలు పొలిటీషియన్ గా కూడా చూడరు. ఇలా చెప్పుకుంటే, నాగబాబు-లోకేష్ మధ్య రాజకీయంగా చాలా పోలికలున్నాయి.

ఇద్దరూ ఇద్దరే. కానీ ఇప్పుడు ఇద్దరిలో ఓ తేడా స్పష్టంగా కనపడుతోంది. జనసేన నాగబాబుని మోస్తోంది, కానీ టీడీపీ మాత్రం లోకేష్ ని సైడ్ చేస్తోంది. ఇటీవల జనసేనలో నాగబాబుకి ప్రయారిటీ పెరిగింది. కానీ పార్టీ తండ్రి చేతుల్లో ఉన్నా కూడా లోకేష్ కి మాత్రం టీడీపీలో ప్రాధాన్యం లేదు. 

చంద్రబాబే.. లోకేష్ రాజకీయాలకు సమాధి కట్టారని అనుకోవాలి. లోకేష్ అసమర్థుడు అని తెలిస్తే ప్రోత్సహించాలి, వెన్నుతట్టాలి. కానీ బాబు మాత్రం లోకేష్ ని పక్కనపెట్టి స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. టీడీపీని తానే అధికారంలోకి తెచ్చి సింహాసనంపై కొడుకుని కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కొడుకుని మరింత అసమర్థుడిగా మార్చేస్తున్నారు.

ఇక నాగబాబు విషయానికొస్తే.. ఇటీవల మెగా బ్రదర్ కి పవన్ కల్యాణ్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్న అనే జాలి చూపిస్తున్నారు. తనకంటే ముందు పార్టీ తరఫున ప్రచారం చేసే బాధ్యతను అప్పగించారు. నిజంగా పవన్ చేసింది ధైర్యమే అనాలి. కానీ అదే ధైర్యాన్ని చంద్రబాబు చూపించలేకపోతున్నారు. కొడుకు లోకేష్ ను జనాల్లోకి పంపించలేకపోతున్నారు. తను టూర్ ఫిక్స్ చేసుకున్నారు. కొడుకును మాత్రం ట్విట్టర్ లో కూర్చోబెట్టారు.

దీంతో జనసేనలో నాగబాబుకు ఉన్నపాటి విలువ కూడా టీడీపీలో లోకేష్ కు లేదా అనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. నాగబాబుపై పవన్ కు ఉన్నంత నమ్మకం కూడా.. లోకేష్ పై చంద్రబాబుకు లేదంటూ, చినబాబుపై జాలి చూపిస్తున్నారు. పేరుకు ఇవి సెటైర్లు అయినప్పటికీ, వాస్తవంగా చూసుకుంటే పచ్చి నిజాలు.