బీజేపీకి సీరియస్ షాకిచ్చిన పవన్ కల్యాణ్..!

పవన్ కల్యాణ్ బీజేపీకి షాకిచ్చారు. అవును, ఇదేమీ ఊహాగానం కాదు. ఈ రోజుతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దాదాపుగా వచ్చేసింది కూడా. బద్వేల్ బైపోల్ లో బీజేపీ తరపున పవన్ కల్యాణ్…

పవన్ కల్యాణ్ బీజేపీకి షాకిచ్చారు. అవును, ఇదేమీ ఊహాగానం కాదు. ఈ రోజుతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దాదాపుగా వచ్చేసింది కూడా. బద్వేల్ బైపోల్ లో బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అనుకున్నారు. కనీసం ఆయన పేరుతో ప్రకటన విడుదల చేస్తారనుకున్నారు. జనసేనాని తరపున నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చేశారని కూడా సోము వీర్రాజు ప్రచారం చేసుకున్నారు.

కట్ చేస్తే.. ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. పవన్ కల్యాణ్, నాదెండ్ల.. ఆ తర్వాతి శ్రేణి నాయకుల పేరుతో కూడా కనీసం ఒక ప్రకటన కూడా బయటకు రాలేదు. దీంతో షాకవడం బీజేపీ వంతయింది.

సెంటిమెంట్ ని గౌరవిస్తూ తమ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు పవన్ కల్యాణ్, ఆ సెంటిమెంట్ ని బీజేపీ కూడా గౌరవిస్తుందని అనుకున్నారు. కానీ బీజేపీ పంతానికి పోటీ చేసింది, తీరా ఇప్పుడు ప్రచారానికి అటు కేంద్ర పెద్దలు రాక, ఇటు రాష్ట్రంలో నమ్మకం పెట్టుకున్న పవన్ కల్యాణ్ రాక అభ్యర్థి ఇబ్బంది పడుతున్నారు. 

వైసీపీ గెలుపు లాంఛనమే, కానీ ఏపీలో బీజేపీ కూడా ఉంది అని నిరూపించుకోడానికి కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకోడానికే కమలదళం తాపత్రయం అంతా.

దానికోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో చేరికలను ప్రోత్సహిస్తూ.. భారీగా నజరానాలు ముట్టజెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచారానికి వచ్చినా, కనీసం పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినా కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందని ఆశించారు. చివరి రోజు వరకూ అదే ఆశలో ఉన్నారు. కానీ పవన్ షాకిచ్చారు. ఈ రోజుతో ప్రచార పర్వం ముగియనుంది.

పవన్ వ్యవహారం బీజేపీకి చెడు చేయకపోవచ్చు అనుకున్నా.. పరోక్షంగా వైసీపీకి మేలు చేస్తుంది. జనసైనికుల్లో జగన్ పై అభిమానం ఉన్నవారంతా దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధకు మద్దతిస్తారు. అంటే బీజేపీకి ఆ కాసిన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నమాట. మొత్తమ్మీద చివరి రోజు వరకు ఊరించి, ఉడికించి పవన్.. బీజేపీకి పెద్ద హ్యాండిచ్చారు.