జనాలు చంద్రబాబు సభలకు ఎగబడుతున్నారు.. అనే గోబెల్స్ ప్రచారం కోసం సందుగొందుల్లో సభలను నిర్వహిస్తున్నారు తెలుగుదేశం వాళ్లు. ఇరుకు సందుల్లోకి చంద్రబాబును తీసుకెళ్లడం. రోడ్డుకు అటూ ఇటూ వరస పెట్టి ఫ్లెక్సీలు కట్టేయడం, మధ్యలో జనాలను చూపి అదో జనసంద్రం అయినట్టుగా డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి.. చంద్రబాబుకు జనాలు హారతులు పడుతున్నారనే గోబెల్స్ ప్రచారం కోసం ఆరాటం!
ప్రధాన ప్రతిపక్షం ఇలాంటి చీప్ ట్రిక్స్ తో చంద్రబాబును ప్రొజెక్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయాస పడుతోంది. అయితే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఈ దుర్ఘటనతో అయినా చంద్రబాబు తీరు కానీ, ఆయన ఈవెంట్ మేనేజ్ మెంట్ తీరు కానీ మారుతుందని ఎవ్వరూ అనుకోరు. అయితే… చంద్రబాబు ఈ సందుగొందుల సభల విషయంలో ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా చంద్రబాబు ప్రయాస కొనసాగుతూ ఉంది.
ఆయన ఈవెంట్ మేనేజ్ మెంట్ టీమ్ లు సందుగొందులను సెలెక్ట్ చేసి సభలు నిర్వహించే ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయడంలో ఆశ్చర్యం లేదు. అయితే మనుషుల ప్రాణాలను ఏ మాత్రం లెక్కలేని రీతిలో సాగుతున్న ఈ ఈవెంట్ మేనేజ్ మెంట్ పట్ల ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి. చంద్రబాబు పబ్లిసిటీ యావను గుర్తించి.. ఈ సభలను ఊరవతల పెట్టుకోవాలని ప్రభుత్వాలు స్పష్టం చేయాలి.
చంద్రబాబు రాజకీయ విషక్రీడ విషయంలో ప్రభుత్వాలు గుర్తెరిగి వ్యవహరించాలి. జనాలను ఎక్కువగా వచ్చినట్టుగా చూపించడమే పరమావధిగా జరిగిన ప్రయత్నాన్ని చిన్నదిగా చూడటం సమంజసం కాదు. మరో మొహమాటం లేకుండా చంద్రబాబు ప్రచార ప్రయాసకు ఈ మైదానాలనో, ఊరవతలి ప్రాంతాన్నో కేటాయించాలి తప్ప.. మరోసారి ఇలాంటి దుర్ఘటనలకు ప్రభుత్వాలు ఆస్కారం ఇవ్వకూడదు.
ఒకవేళ ఇప్పటికే చంద్రబాబు సందుగొందుల సభలకు పర్మిషన్లు ఇవ్వకపోతే తమకు భయపడి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదంటూ గగ్గోలు పెట్టేవారు. అయితే ఇలా మనుషుల ప్రాణాలను తీస్తున్న ఈ తీరుతో ఇక ఎలాంటి గగ్గోలు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఇకనైనా ప్రభుత్వాలు ఈ విషక్రీడ పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలి.