రాష్ట్రం గురించి వదిలేసి రాష్ట్రపతి పాలన ….?

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన చాలా కాలానికి వెళ్లారు. ఏపీలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఏపీని అడ్డగోలుగా విడగొట్టారు. నాడు ఎన్నో హామీలు ఇచ్చారు. విభజన హామీలన్నీ…

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన చాలా కాలానికి వెళ్లారు. ఏపీలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఏపీని అడ్డగోలుగా విడగొట్టారు. నాడు ఎన్నో హామీలు ఇచ్చారు. విభజన హామీలన్నీ చట్టంలో భద్రంగా ఉన్నాయి. అయితే అవి అమలునకు మాత్రం ఎక్కడా నోచుకోవడంలేదు.

మరి దీని మీద ఎవరైనా అడుగుతున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి మధు నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టమని డిమాండ్ చేస్తున్నారని, అంతే తప్ప రాష్ట్రానికి రావాల్సినవి, కావాల్సినవి ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు కోరడంలేదని మధు ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని విధాలుగా ఏపీకి తీరని అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పోలవరానికి నలభై వేల కోట్లు కావాల్సి ఉండగా కేవలం ఇరవై వేల కోట్లే ఇస్తామనడం దారుణమని అన్నారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చేస్తామంటున్నారని, ఏపీలో ఏ ఒక్క విభజన హామీని కేంద్రం ఈ రోజుకీ అమలు చేయడం లేదని మధు ఫైర్ అయ్యారు.

అలాంటి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాల్సిన చోట ఏపీ రాజకీయ పార్టీలు అడుగుతున్నదేంటి అని ఆయన గర్జించారు. ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు రాష్ట్రం కోసం మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మంచి పరిణామమని, అంతా కలసి కేంద్రాన్ని నిగ్గదీస్తేనే ప్లాంట్ బతుకుతుంది అని మధు అభిప్రాయపడ్డారు.