ప్రభాస్ నిక్ నేమ్ డార్లింగ్..ప్రభాస్ అందరినీ పిలిచే పిలుపు డార్లింగ్. నిజంగా ప్రభాస్ స్వభావం కూడా డార్లింగ్ నే. స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు. తను పాన్ ఇండియా స్టార్ అయిపోయినా, మూలాలు మరిచిపోడు.
స్నేహం మరిచిపోడు. ఆ స్నేహంతోనే దర్శకుడు పూరి జగన్నాధ్ కోసం ఆయన కొడుకు ఆకాష్ పూరిని ఇంటర్వూ చేసాడు. ఒక పాన్ ఇండియా స్టార్ ఇలా ఓ బడ్డీ హీరో హీరోయిన్లను ఇంటర్వూ చేయడం నిజంగా విశేషం.
పైగా ఈ ఇంటర్వూ చాలా లైటర్ నోట్ లో సాగింది. ప్రభాస్ ఈ ఇంటర్వూ చేసిన తీరు నిజంగా సూపర్. అంతా అయిపోయిన తరువాత ఆకాష్ పూరి థాంక్స్ చెబితే, ఇంతలా ఎందుకు రొమాంటిక్ సినిమాకు ప్రమోషన్ తో సహకరించాడో చెప్పాడు.
బుజ్జిగాడు సినిమా టైమ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నాడు. పూరి భార్య లావణ్య మంచి తనాన్ని గుర్తు చేసుకున్నాడు.
బుజ్జిగాడు టైమ్ లో తాను, పూరి, లావణ్య కలిసి భోజనం చేస్తున్నపుడు అక్కడ మరో మహిళ కూడా భోజనం చేసారట. ఎవరా మహిళ అని ఆరా తీస్తే, పూరి ఇంట్లో పని చేసే పనిమనిషి అని బదులు వచ్చిందట.
ఇంట్లో పని చేసే పనిమనిషిని తమతోపాటే భోజనానికి కూర్చో పెట్టే గొప్ప మనసు లావణ్యది అని ప్రభాస్ చెప్పుకువచ్చాడు. అందుకే తాను ఇంతలా సాయం చేసానన్నాడు. అమ్మను జాగ్రత్తగా చూసుకో అని కూడా సలహా ఇచ్చాడు ప్రభాస్.