బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ కొత్త బంధంలో ఉన్నట్టుగా ఉంది. తన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆమె ఇందుకు సంబంధించి క్లూస్ ఇస్తోంది. కొన్నేళ్ల కిందట హృతిక్- సుసాన్ లు విడిపోయారు.
విడాకులు తీసుకుని అధికారికంగా వేరయ్యారు. అయితే అడపాదడపా కలిసి కనిపిస్తూ వచ్చారు. పిల్లల కోసం వారు కలిసి కనిపించే వాళ్లు. పిల్లలను తీసుకుని విహారాలకు జంటగానే వెళ్లే వారు. విడాకులు అయినా.. అలా స్నేహాన్ని అయితే వారు కొనసాగించారు.
హృతిక్- సుసాన్ లు చిననాటి స్నేహితులే. ఆ స్నేహమే ప్రేమగా మారి, పెళ్లి వరకూ వెళ్లింది. ఇయర్ 2000లో వారి వివాహం జరిగింది. పద్నాలుగు సంవత్సరాల పాటు వివాహబంధాన్ని కొనసాగించారు. ఇద్దరు పిల్లలు కలిగారు. చివరకు విడాకులు తీసుకున్నబాలీవుడ్ జంటల జాబితాలో నిలిచారు.
ఇక ఇప్పుడు సుసాన్ కొత్త బంధాన్ని బహిరంగ పరిచింది. అతడూ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే. అతడి పేరు అర్స్లాన్ గోనీ అని తెలుస్తోంది. సుసాన్ పుట్టిన రోజు సందర్భంగా అతడు గ్రీటింగ్స్ తెలిపాడు. ఇందులో వారు కిస్సులు, లవ్ ఇమోజీలతో తమ బంధంలోని గాఢతను తెలియజేశారు. అలాగే అతడిని సుసాన్ 'మై ఎవ్రిథింగ్' అంటూ సంబోధించింది.
దీని అర్థం.. వీరి రిలేషన్షిప్ లోని ప్రేమబంధమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. లవ్ ఇమోజీలు, కిస్సు లను సోషల్ మీడియా వేదికగా టెక్ట్స్ చేసుకోవడంతో.. హృతిక్ మాజీ భార్య మరో వ్యక్తితో నూతన బంధాన్ని ప్రారంభించినట్టుగా ఉందనే చర్చ జరుగుతోంది.