హీరోయిన్ సమంత పై పెట్టిన యూ ట్యూబ్ వీడియోల కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్‌లో ఆమెకి సంబంధించిన వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది.
గమ్మత్తేమిటంటే అదే సమయంలో ఆమె కూడా వ్యక్తిగత వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని కోర్టు సమంతకి సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తన వైవాహిక జీవితానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సమంత పిటిషన్ దాఖలు చేశారు.
వాదనల అనంతరం కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఆ రెండు యూట్యూబ్ ఛానళ్లు వీడియో లింక్స్‌ని తొలగించాలని ఆదేశాలు వెలువరించింది.