దటీజ్ రమేష్ హాస్పిటల్?

రమేష్ ఆసుపత్రికి చాలా పేరు ప్రఖ్యాతులు వున్నాయి. నాకు కులమేంటీ? నాకు మతమేంటీ? అంటూ ఆ మధ్య రమేష్ ఆసుపత్రి యజమాని ఓ అయాచిత స్టేట్ మెంట్ కూడా పడేసారు. అవును అవసరం అయితే…

రమేష్ ఆసుపత్రికి చాలా పేరు ప్రఖ్యాతులు వున్నాయి. నాకు కులమేంటీ? నాకు మతమేంటీ? అంటూ ఆ మధ్య రమేష్ ఆసుపత్రి యజమాని ఓ అయాచిత స్టేట్ మెంట్ కూడా పడేసారు. అవును అవసరం అయితే అలా లేదంటే ఇలా వ్యవహరించే వారికి కులం పెద్ద ఇస్యూ కాదు. ఈ విషయంలో టాలీవుడ్ లో ఓ గ్యాసిప్ వినిపిస్తోంది.

కొన్నాళ్ల క్రితం రమేష్ ఆసుపత్రిలో  ఏదో గడబిడ జరిగిందట. అప్పుడు ఓ ఛానెల్ ఈ విషయమై గట్టిగా స్టోరీల మీద స్టోరీలు వేసింది. దాంతో రమేష్ ఆసుపత్రితో సన్నిహిత బాంధవ్యం వున్న హీరో రామ్ బంధువు సవ్రంతి రవికిషోర్ రంగంలోకి దిగారు. అయితే నేరుగా కాకుండా తనకు, ఆ ఛానెల్ కు మధ్య పరిచయాలు వున్న మరో నిర్మాత సాయం తీసుకున్నారు. ఆ నిర్మాత అయితేనే ఆ చానెల్ యాజమాన్యానికి నచ్చ చెప్పగలరు అని లెక్కలు కట్టారు.

దాంతో వ్యవహారం ముందుకు సాగింది. సదరు ఛానెల్ పెద్దాయిన కూడా ఇండస్ట్రీతో రిలేషన్ లు కోరుకునే వారు కావడంతో, సరే అని ఆ విషయాన్ని మరింత కొనసాగించకుండా అక్కడితో వదిలేసారు. కానీ కథ అక్కడే మలుపు తిరిగింది. తమ మాట మన్నించి, కథనాలు మరి ప్రసారం చేయకుండా ఆఫేసిన ఆ ఛానెల్ 'మనవాళ్ల'దే కదా అని కూడా చూడకుండా లీగల్ నోటీసు పంపించారు.

దీంతో అవాక్కయిన ఆ చానెల్ పెద్దాయిన,తన వద్దకు రాయబారం తెచ్చిన నిర్మాతకు విషయం వివరించారట. వీళ్ల విషయం ఇలా వుంటుంది. అందుకే ఇలాంటి వాళ్లకు ఇంకెప్పుడు రాయబారాలు నడపకండి అని సుతిమెత్తగా చెప్పారట. అదీ విషయం.

ఏపీలో జగన్ ని మించిన లీడర్ ఎవడూ లేడు

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే