రమేష్ ఆసుపత్రికి చాలా పేరు ప్రఖ్యాతులు వున్నాయి. నాకు కులమేంటీ? నాకు మతమేంటీ? అంటూ ఆ మధ్య రమేష్ ఆసుపత్రి యజమాని ఓ అయాచిత స్టేట్ మెంట్ కూడా పడేసారు. అవును అవసరం అయితే అలా లేదంటే ఇలా వ్యవహరించే వారికి కులం పెద్ద ఇస్యూ కాదు. ఈ విషయంలో టాలీవుడ్ లో ఓ గ్యాసిప్ వినిపిస్తోంది.
కొన్నాళ్ల క్రితం రమేష్ ఆసుపత్రిలో ఏదో గడబిడ జరిగిందట. అప్పుడు ఓ ఛానెల్ ఈ విషయమై గట్టిగా స్టోరీల మీద స్టోరీలు వేసింది. దాంతో రమేష్ ఆసుపత్రితో సన్నిహిత బాంధవ్యం వున్న హీరో రామ్ బంధువు సవ్రంతి రవికిషోర్ రంగంలోకి దిగారు. అయితే నేరుగా కాకుండా తనకు, ఆ ఛానెల్ కు మధ్య పరిచయాలు వున్న మరో నిర్మాత సాయం తీసుకున్నారు. ఆ నిర్మాత అయితేనే ఆ చానెల్ యాజమాన్యానికి నచ్చ చెప్పగలరు అని లెక్కలు కట్టారు.
దాంతో వ్యవహారం ముందుకు సాగింది. సదరు ఛానెల్ పెద్దాయిన కూడా ఇండస్ట్రీతో రిలేషన్ లు కోరుకునే వారు కావడంతో, సరే అని ఆ విషయాన్ని మరింత కొనసాగించకుండా అక్కడితో వదిలేసారు. కానీ కథ అక్కడే మలుపు తిరిగింది. తమ మాట మన్నించి, కథనాలు మరి ప్రసారం చేయకుండా ఆఫేసిన ఆ ఛానెల్ 'మనవాళ్ల'దే కదా అని కూడా చూడకుండా లీగల్ నోటీసు పంపించారు.
దీంతో అవాక్కయిన ఆ చానెల్ పెద్దాయిన,తన వద్దకు రాయబారం తెచ్చిన నిర్మాతకు విషయం వివరించారట. వీళ్ల విషయం ఇలా వుంటుంది. అందుకే ఇలాంటి వాళ్లకు ఇంకెప్పుడు రాయబారాలు నడపకండి అని సుతిమెత్తగా చెప్పారట. అదీ విషయం.