లాంఛ్ చేసినప్పట్నుంచి కిందామీద పడుతున్న ఓటీటీ వేదిక “ఆహా”. తమకు లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్నారని ఘనంగా చెప్పుకోవడం మినహా, ఈ ఓటీటీలో ఓ రేంజ్ లో క్లిక్ అయిన కంటెంట్ పెద్దగా కనిపించడం లేదు. సినిమాల విషయంలో ఇప్పటికే వెనకబడిన ఈ సంస్థ, ఒరిజినల్ కంటెంట్ విషయంలో కూడా అదే పనితీరు చూపిస్తోంది.
“సిన్” లాంటి అడల్ట్ కంటెంట్ తో సీ-గ్రేడ్ మూవీ తీసి ఇప్పటికే విమర్శల పాలైన ఆహాలో తాజాగా స్ట్రీమింగ్ వచ్చిన మరో ఒరిజినల్ మూవీ “మెట్రో కథలు”. కాస్త తెలిసిన ముఖాలతో తీసిన ఈ సినిమా కూడా ఇప్పుడు ఆహా అనిపించుకోలేకపోయింది. ఈ సినిమాకు కూడా ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది.
“మెట్రో కథలు” అంటూ 4 కథల్ని ఒకే సినిమాలో చిన్న చిన్న లింక్స్ తో చూపించాలని దర్శకుడు కరుణ కుమార్ (పలాస మూవీ దర్శకుడు ఇతడు) ప్రయత్నించి విఫలమయ్యాడు. బడ్జెట్ అవరోధాలు, నటీనటుల పెర్ఫార్మెన్సులు, టెక్నీషియన్స్ అనుభవలేమి ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఉన్నంతలో తమ సీనియారిటీకి తగ్గట్టు రాజీవ్ కనకాల, సన ఓకే అనిపించుకున్నారు. అయితే వీళ్లందరికంటే నందినీరాయ్ తన నటనతో బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇవన్నీ పక్కనపెడితే.. రైటింగ్ సరిగ్గా లేకపోవడం, కథలకు సరైన ముగింపు ఇవ్వకపోవడంతో మెట్రోకథలు నిరాశ పరుస్తుంది.
అలా ఆహా వేదిక మరో ఫ్లాప్ సినిమాకు వేదికగా మారింది.