దేవసేన' అనుష్కతో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న చిత్రం నిశ్శబ్దం. వైవిధ్యమైన సినిమాలు, సరైన పాత్రలు వుంటేనే ఓకె అంటున్న అనష్క లేటెస్ట్ గా అంగీకరించిన సినిమా ఇదే. తెలుగు వారికి పరిచయమైన తమిళ హీరో మాధవన్, తమిళులకు పరిచయమైన తెలుగు హీరోయిన్ అనుష్క కాంబినేషన్ కావడంతో మల్టీ లింగ్యువల్ లుక్ వచ్చేసింది. అయితే ఇంతకాలం ఈ సినిమా గురించి పెద్దగా తెలిసింది లేదు.
పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం అన్నంత వరకే తెలుసు. సినిమా వర్క్ పూర్తయినట్లుంది. ప్రచారానికి తెర తీసారు. టీజర్ విడుదల చేస్తామంటూ, సినిమాకు టీజర్ వదిలినట్లుగా, టీజర్ కు ఓ టీజర్ విడుదల చేసారు.
సినిమా టైటిల్ నిశ్శబ్దం కానీ, ప్రీ టీజర్ కు ఇచ్చిన ఆర్ ఆర్ మాత్రం ఆసక్తి రేపేలా వుంది. సినిమాకు ఓ థ్రిల్లర్ లుక్ ను తీసుకువచ్చింది. సినిమా మొత్తం విదేశాల్లో తీయడం వల్ల ఫ్రేమ్ లు, లొకేషన్లు బాగున్నాయి. మొత్తంమీద ఏడున విడుదలయ్యే టీజర్ మీద ఆసక్తి కలిగించేలా వుంది.