బీజేపీకి మరో గట్టి పరీక్ష రెడీ!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అలా అయిపోయాయో లేదో.. ఇంతలోనే భారతీయ జనతా పార్టీకి మరో గడ్డు పరీక్ష ఎదురు అవుతోంది. ఇది కర్ణాటక నుంచి! వాస్తవానికి కర్ణాటకలో బైపోల్స్ కూడా మహారాష్ట్ర,…

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అలా అయిపోయాయో లేదో.. ఇంతలోనే భారతీయ జనతా పార్టీకి మరో గడ్డు పరీక్ష ఎదురు అవుతోంది. ఇది కర్ణాటక నుంచి! వాస్తవానికి కర్ణాటకలో బైపోల్స్ కూడా మహారాష్ట్ర, హర్యానాలతో పాటే జరగాల్సింది. కానీ.. అనూహ్యంగా అవి వాయిదా పడ్డాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటుపడింది. అనర్హత వేటే గాకా కొన్నేళ్ల పాటు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నాటి స్పీకర్ రమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. వాటిపై సదరు ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ విచారణలో ఉంది.

అన్నీ కుదిరితే నవంబర్ ఆఖర్లో, డిసెంబర్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు అక్కడి పార్టీలు రెడీ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో వారికే టికెట్లు ఇచ్చేదా లేక తమ పార్టీ పాత కాపులకు ఇచ్చేదా అనే విషయంపై బీజేపీ తర్జనభర్జన పడుతూ ఉంది. అనర్హత వేటుకు గురి అయిన వారికి పోటీకి అవకాశం వస్తుందో రాదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వారికి పోటీకి అవకాశం లేకపోతే వారి పరిస్థితి కుడితోపడ్డ ఎలుకల్లా అవుతుంది!

మరోవైపు కమలం పార్టీలో అసంతృప్తవాదులు చెలరేగుతూ ఉన్నారు. ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వకపోయినా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకోవడానికి డక్కామొక్కీలు తింటూ ఉంది. యడ్యూరప్పను పేరుకైతే ముఖ్యమంత్రి చేశారు. అయితే ఆయనను దించాలని, తమను ఎక్కించాలని డిమాండ్ చేసే వాళ్లు తయారయ్యారు. యడ్యూరప్పను 
కేవలం నామమాత్రపు ముఖ్యమంత్రినే చేసింది అధిష్టానం.

ఆయనకు అనేకమంది డిప్యూటీలను నియమించింది. ఆ హోదాలో దక్కలేదని మరికొందరు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బైపోల్స్ రాబోతూ ఉన్నాయి. ఈ ఫలితాల్లో తేడా వస్తే మాత్రం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ మనుగడ కూడా కష్టమే అని పరిశీలకులు అంటున్నారు.

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు