ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లాంటి హీరోల డాన్స్ విషయంలో ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. పాటలు వచ్చాయంటే ఈ హీరోల స్టెప్పుల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడే ఎన్టీఆర్ కు షాకిచ్చింది రాశీఖన్నా. స్టెప్పులన్నీ తారక్ కే ఇస్తారేంటి.. నేను కూడా డాన్స్ చేస్తా, నాక్కూడా మూమెంట్స్ ఇవ్వండంటూ డిమాండ్ చేసిందట. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యాడు.
జై లవకుశ సాంగ్ షూటింగ్ టైమ్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఇలా ఎన్టీఆర్ కు షాకిచ్చిన విషయాన్ని రాశి ఖన్నానే బయటపెట్టింది. ప్రతిరోజూ పండగే మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రాశి.. జై లవకుశ సినిమాలో తనకు కూడా కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ కావాలంటూ పట్టుబట్టిందట. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని డాన్స్ మూమెంట్స్ ను తను కూడా చేస్తానని మొండికేసిందట.
కేవలం డాన్స్ లోనే కాదు, యాక్టింగ్-డైలాగ్స్ లో కూడా రాశిఖన్నా ఇలానే వ్యవహరిస్తుంటుందట. సీన్ లో తనకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా, డైలాగ్స్ తగ్గినా వెళ్లి వెంటనే దర్శకుడ్ని అడుగుతుందట. అంతేకాదు.. కొన్ని సార్లు తోటి ఆర్టిస్టుల డైలాగ్స్ కూడా తనే చెప్పేస్తుంటుందని అంటున్నాడు హీరో సాయితేజ్.
సుప్రీమ్ సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా బాగా చేసిందని, అందుకే ప్రతిరోజూ పండగే సినిమాలో ఏంజెలినా పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని తనే రిఫర్ చేశానని తెలిపాడు సాయి తేజ్. డిసెంబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.