ప్లాన్ చేసి డిస్ లైక్స్ కొట్టించారా?

ఆలియా భట్ నటించిన ‘సడక్ 2’ ట్రెయిలర్‌కి కోటికి పైగా డిస్ లైక్స్ రావడం సంచలనమయింది. సుషాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణానంతరం బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. వారిలో ఆలియా భట్, మహేష్…

ఆలియా భట్ నటించిన ‘సడక్ 2’ ట్రెయిలర్‌కి కోటికి పైగా డిస్ లైక్స్ రావడం సంచలనమయింది. సుషాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణానంతరం బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. వారిలో ఆలియా భట్, మహేష్ భట్ ముందు వరుసలో వుండడంతో ఈ ట్రెయిలర్‌కి డిస్ లైక్స్ కొట్టడం ద్వారా తమ కోపాన్ని, అలాగే దివంగత నటుడిపై ప్రేమనీ చాటుకుంటున్నారు సుషాంత్ అభిమానులు.

అయితే ఎంత ఆగ్రహం వున్నా ఈ స్థాయిలో నిరసన వుంటుందా? పనిగట్టుకుని మరీ ట్రెయిలర్ లింక్ ఓపెన్ చేసి డిస్ లైక్ కొడతారా? దీనిపై విచిత్రమైన కథనాలు వెలువడుతున్నాయి. ఎలాగో ఈ సినిమా సుషాంత్ సానుభూతిపరులకు టార్గెట్ కనుక దానినే ప్రచారాంగా వాడుకోవడానికి ఈ చిత్ర బృందం బాట్స్‌తో డిస్ లైక్స్ పర్వాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లిందని అంటున్నారు.

రివర్స్ స్ట్రాటజీతో పబ్లిసిటీ మరింత పెంచుకోవడం లాంటిదన్నమాట. బాలీవుడ్ అంటేనే మార్కెటింగ్ ట్రిక్స్‌లో ఘనాపాటి. కనుక ఈ రివర్స్ గేమ్ ప్లాన్ సదరు చిత్ర బృందమే చేసి వున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే చాలా మామూలుగా వున్న ఆ ట్రెయిలర్‌కి అన్ని వ్యూస్, ఇంత పబ్లిసిటీ వచ్చి వుండేదే కాదు. ఏదేమైనా సుషాంత్ మరణానంతరం ఇండియన్ సోషల్ మీడియా బాగా వేడెక్కిపోయింది. సెలబ్రిటీలు కూడా ట్రోల్స్‌కి దొరక్కుండా ‘కవర్స్’ తీసుకునేంతగా. 

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే

ఇదీ జగన్ విజన్