డిజిటల్ యుగంలో కొత్త మార్పు ఏమిటంటే విడియో కంటెంట్ కే ఎక్కువ ఆదరణ వుండడం. అందుకే ఫస్ట్ లుక్ లు కన్నా ఫస్ట్ విడియోలు, విడియో సాంగ్ లకే ఆదరణ ఎక్కువ. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీమ్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబడింది. డిసెంబర్ నుంచి అన్నీ స్టార్ట్ చేద్దామన్నది వాళ్ల ప్లాన్.
అయితే తమ సినిమాకు పోటీ అయిన అల వైకుంఠపురములో వ్యవహారం వేరుగా వుంది. రెండు పాటలు విడుదల చేసేసి దుమ్ము లేపేసారు. రెండు పాటలూ చార్ట్ బస్టర్. బన్నీ డ్యాన్స్ నెంబర్ అయితే ఫ్యాన్స్ కు పండగ ఇచ్చేసింది.
ఇలాంటి టైమ్ లో, సరిలేరు దర్శకుడు అనిల్ రావిపూడి ఓ చిట్కా వైద్యం లాంటి విడియో అప్పటికప్పుడు తయారుచేయించి వదిలారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కలిసి వేరే వ్యక్తికి సినిమా స్క్రీన్ ప్లే చకచకా చెబుతుండడం, అలాంటి టైమ్ లో అనిల్ రావిపూడి వచ్చి వారించడం, ఇంకా సంక్రాంతి వరకు టైమ్ వుంది కదా అని అనడం ఇదీ కంటెంట్.
పనిలో పనిగా సినమాను లేపడం పీఆర్ టీమ్ పని అని, బెటర్ మెంట్ చేయడం రైటింగ్ డిపార్ట్ మెంట్ పని అని, వేరే వాళ్లు చేయాల్సింది ఏదీ లేదంటూ ఓ డైలాగు వేసాడు. ఒక విధంగా ఈ డైలాగులు రెండు అంచుల కత్తుల్లాంటివి. ఇటు సరిలేరు టీమ్ కూడా వర్తిసాయి.
ఏమైనా విడియోలో ఓ విషయం మాత్రం పక్కాగా కనిపించింది.దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ రైటింగ్ లోనే కాదు, కామెడీ యాక్టింగ్ లో కూడా మాంచి పట్టువుందని క్లియర్ అయింది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ల కామెడీ టైమింగ్ ను ఆయన కూడా పక్కాగా మెయింటెయన్ చేసి అలరించాడు.