హీరో నాగశౌర్య లేటెస్ట్ కమ్ స్వంత సినిమా టైటిల్ వచ్చేసింది. అశ్వద్ధామ అన్న టైటిల్ ముందు నుంచీ వినిపిస్తూనే వుంది. అదే ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు. టైటిల్ తో పాటు సినిమా కాన్సెప్ట్ అన్నట్లుగా, చిన్న పసిబిడ్డ వేలును పట్టుకున్న మరోవేలు కలిపి కనిపించీ కనిపించనట్లు, తెలిసీ తెలియనట్లు విడుదల చేసారు.
తొలిసారి నాగశౌర్య యాక్షన్ కమ్ థ్రిల్లర్ టచ్ వున్న మూవీలో చేస్తున్నాడు. సినిమా మొత్తం ఇంటిలిజెంట్ ఇన్వెస్టిగేషన్ తో, దాంతో పాటే మాంచి యాక్షన్ సీక్వెన్స్ లతో నడుస్తుందని నిర్మాత ఉష మాల్పూరి చెబుతున్న సంగతి.
ఈ సినిమా యాక్షన్ సీన్ లోనే డూప్ లేకుండా చేసి, గాయపడ్డాడు నాగశౌర్య. ఆ గాయం నుంచి కోలుకుని సినిమాను ఆల్ మోస్ట్ ఫినిష్ చేసారు. ప్రస్తుతం ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. అందుకే ఆ జోనర్ లో తొలిసారి ట్రయ్ చేస్తున్నాడు నాగశౌర్య.