కాస్త గ్యాప్ తీసుకుని హీరో నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. వెంకీ కుడుముల దర్శకుడు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రెండు కాన్సెప్ట్ పోస్టర్లు విడుదల చేసారు. ఓ పోస్టర్ లో రొమాంటిక్ టచ్, మరో పోస్టర్ లో యాక్షన్ టచ్ ఇవ్వడం విశేషం.
రష్మిక చీర కట్టులో చకచకా సాగిపోతుంటే, నడుంను రెండు చేతులతో పట్టాలనుకునే భీష్మ ఓ పోస్టర్ లో, రౌడీ మూకలను పట్టు పట్టే భీష్మ మరో పోస్టర్ లో కనిపించాడు. పోస్టర్ లు రెండూ స్టయిలిష్ గా వున్నాయి. రష్మిక అందంగా కనిపిస్తోంది. నితిన్ ఎప్పటిలాగే మాన్లీగా వున్నాడు.
డిసెంబర్ కు రావాల్సిన సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అందువల్ల పోస్టర్ తో సరిపెట్టినట్లు కనిపిస్తోంది. లేదూ అంటే ఈ వేళకు టీజర్ రావాలి కదా? ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో షూటింగ్ జరుపుకుంటున్న భీష్మ, మరో షెడ్యూలు యూరప్ లో వుంది. అక్కడితో సినిమా పూర్తవుతుంది.