దీపావళి సాక్షిగా క్రిస్మస్ కు లైన్ క్లియర్

ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అరడజను సినిమాలు డిసెంబర్ 20కి వస్తున్నట్టు తమకుతాముగా ప్రకటించుకున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటూ పోయారు. దీంతో సంక్రాంతి కంటే ఎక్కువగా క్రిస్మస్…

ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అరడజను సినిమాలు డిసెంబర్ 20కి వస్తున్నట్టు తమకుతాముగా ప్రకటించుకున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటూ పోయారు. దీంతో సంక్రాంతి కంటే ఎక్కువగా క్రిస్మస్ కే పోటీ కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కొక్కరుగా తప్పుకున్నారు. ఈ దీపావళితో క్రిస్మస్ కు రాబోయే సినిమాలు ఓ కొలిక్కి వచ్చాయి.

వెంకీమామ, భీష్మ, డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే, రూలర్, నిశ్శబ్దం.. ఇలా చాలా సినిమాల్ని డిసెంబర్ 20కి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు వీటిలో కొన్ని మాత్రమే ఫిక్స్ అయ్యాయి. డిసెంబర్ 20కి కచ్చితంగా వస్తుందనుకున్న భీష్మ సినిమా వాయిదాపడింది. బహుశా ఫిబ్రవరిలో రావొచ్చు. ఇక వెంకీమామ కూడా వస్తుందనుకుంటే అది కూడా వాయిదాపడింది. ఇంకా థియేటర్లు, డేట్లు సర్దుబాటుతోనే ఉన్నారు సురేష్ బాబు.

వీటితో పాటు నిశ్శబ్దం సినిమాను కూడా వాయిదావేశారు. అనుష్క, మాధవన్ నటించిన ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేసి అలా థియేటర్లలోకి రావడమే. బిజినెస్ ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. కానీ థియేటర్లు దొరక్క సినిమాను పక్కనపెట్టారు. సో.. ఈ క్రిస్మస్ కు మిగిలింది డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు మాత్రమే.

వీటిలో ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు డిసెంబర్ 20న రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే వీటి బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. అగ్రిమెంట్లు కూడా జోరుగా నడుస్తున్నాయి. డిస్కోరాజాపై మాత్రం ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి.

రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. నిర్మాతలు ఆశిస్తున్న రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం లేదు. మరో 10 రోజులు చూసి సినిమాను డిసెంబర్ 20కే ఫిక్స్ చేయాలా లేక వాయిదా వేయాలా అనే నిర్ణయం తీసుకుంటారు. 

అవును కాదు.. ఇది ఆవిరి.. ఎమోషన్ వేడి