దీపావళి వస్తే నాకు 3 ఇళ్లలో పండగ

అందరూ దీపావళిని తమ ఇళ్లలో జరుపుకుంటారు. కానీ హీరో సాయితేజ్ మాత్రం ఏకంగా మూడు ఇళ్లలో సెలబ్రేట్ చేసుకుంటానంటున్నాడు. దీపావళి వచ్చిందంటే తనకు ఏకంగా 3 ఇళ్లలో పని ఉంటుందని, అన్ని ఇళ్లు చుట్టేస్తానని…

అందరూ దీపావళిని తమ ఇళ్లలో జరుపుకుంటారు. కానీ హీరో సాయితేజ్ మాత్రం ఏకంగా మూడు ఇళ్లలో సెలబ్రేట్ చేసుకుంటానంటున్నాడు. దీపావళి వచ్చిందంటే తనకు ఏకంగా 3 ఇళ్లలో పని ఉంటుందని, అన్ని ఇళ్లు చుట్టేస్తానని చెబుతున్నాడు.

“చెన్నైలో పుట్టిపెరిగాను. అక్కడ దీపావళి చాలా పెద్ద పండగ. కజిన్స్ అంతా కలుస్తాం. పొద్దున్నంతా అల్లు అరవింద్ ఇంట్లో. సాయంత్రం అయ్యేసరికి చిరంజీవి ఇంట్లో. అక్కడే టపాసులు కాల్చడం, భోజనాలు అన్నీ. చెన్నైలో మాకు ఎదురుగా విజయనిర్మల గారి ఇల్లు ఉండేది. నవీన్ విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. సో.. అక్కడికి వెళ్లేవాడిని. రాత్రంతా అక్కడే. ఇలా దీపావళి చాలా సంబరంగా ఉండేది. చాలా ఎంజాయ్ చేసేవాడ్ని. హైదరాబాద్ వచ్చినా ఆ అలవాటు మారలేదు. మార్నింగ్ అల్లు అరవింద్ ఇంటికెళ్తాను, సాయంత్రం చిరంజీవి గారి ఇల్లు, అట్నుంచి అటు నవీన్ విజయ్ ఇంటికి వెళ్తా. ఆ అలవాటు మారలేదు.”

పర్యావరణానికి హాని కలుగుతుందని దీపావళి చేసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదంటున్నాడు సాయితేజ్. ప్రతి విషయానికి ఓ లిమిట్ ఉంటుందని, ఆ హద్దుల్లో దీపావళిని జరుపుకుంటూనే.. ఎక్కువగా చెట్లు నాటడం, నదుల్ని కాపాడుకోవడం చేస్తే దీపావళికి ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతున్నాడు.

దీపావళి సందర్భంగా ప్రతిరోజూ పండగే సినిమా ప్రచారాన్ని ప్రారంభించాడు సాయితేజ్. దర్శకుడు మారుతితో కలిసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తమ సినిమాలో ప్రతి రోజూ ఓ దీపావళి కనిపిస్తుందని, తాత-మనవుడు పాత్రలు అలా ఉంటాయని చెబుతున్నాడు సాయితేజ్.

“ప్రతిరోజూ పండగ సినిమాలో 90శాతం ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. 10శాతం మాత్రం ఎమోషన్ ఉంటుంది. ఆ 10 శాతమే వంద శాతంతో సమానం. ఈ సినిమా చాలా తొందరగా వర్కవుట్ అయింది. ఒకరోజు మారుతి వచ్చి లైన్ చెప్పాడు. జస్ట్ లైన్ మాత్రమే చెప్పాడు. తర్వాత 5 రోజులకు టోటల్ కథ మొత్తం చెప్పేశాడు. ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోయాం”

డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది ప్రతిరోజూ పండగే. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయితేజ్ కు తాతగా కీలకమైన పాత్రలో సత్యరాజ్ కనిపిస్తున్నాడు. హీరో-దర్శకుడు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అందించారు.

అవును కాదు.. ఇది ఆవిరి.. ఎమోషన్ వేడి