లోకేష్.. గన్నవరం నుంచి పోటీచేస్తారా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో నెగ్గుకు రాలేకపోయిన సంగతి తెలిసిందే. తొలిసారే నామినేటెడ్ పోస్టుతో మంత్రి అయ్యి, అత్యంత పేలవంగా కెరీర్ మొదలుపెట్టారు నారాలోకేష్ బాబు.…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో నెగ్గుకు రాలేకపోయిన సంగతి తెలిసిందే. తొలిసారే నామినేటెడ్ పోస్టుతో మంత్రి అయ్యి, అత్యంత పేలవంగా కెరీర్ మొదలుపెట్టారు నారాలోకేష్ బాబు. ఆ తర్వాత లోకేష్ కథ అలాగే సాగుతూ ఉంది. ఇప్పటికీ లోకేష్ కు సూటిగా స్పష్టంగా మాట్లాడటం చేతకావడం లేదు. ఇక ట్విటర్ రాజకీయాలను జనాలు పట్టించుకునేలా లేరు. ఇలాంటి నేఫథ్యంలో తెలుగుదేశం పార్టీకి మరిన్ని సుడిగుండాలు ఎదురుకాబోతూ ఉన్నాయి.

అందులో గన్నవరం నియోజకవర్గం రాజకీయం కూడా ఒకటి అని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సైతం సై అంటూ వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే టాక్ మొదలైంది. ఎవరు వచ్చినా తాము చేర్చుకుంటామని, అయితే ఎమ్మెల్యేలు వస్తే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెబుతున్నారు. వంశీ చేరితే గన్నవరం నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖరారు అయినట్టే.

మరి అదే జరిగితే.. అది నారాలోకేష్ కు గొప్ప అవకాశం కాగలదని కూడా పరిశీలకులు అంటున్నారు. ఎలాగూ కేరాఫ్ కమ్మ వాళ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. లోకేష్ కు అలాంటి నియోజకవర్గాలే కావాలి కూడా. ఈ నేపథ్యంలో గన్నవరం నుంచి లోకేష్ బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోవచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో బరిలోకి దిగి చిత్తు అయిన లోకేష్ కు ఇప్పుడు గన్నవరానికి ఉపఎన్నిక వస్తే.. మరోసారి ప్రయత్నించేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి బైపోల్ లో బరిలోకి దిగడానికి లోకేష్ సై అంటారా? అనేది మాత్రం ఇంకా స్పష్టత లేని అంశం.

అవును కాదు.. ఇది ఆవిరి.. ఎమోషన్ వేడి